హోమ్ /వార్తలు /national /

ముసలి నక్క, యువనక్క.. చంద్రబాబు, లోకేష్‌పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముసలి నక్క, యువనక్క.. చంద్రబాబు, లోకేష్‌పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన అందిస్తుంటే.. ఓ ముసలి నక్క, ఆయన కొడుకు యువనక్కకు కడుపు మంటగా ఉందని వ్యాఖ్యానించారు.

  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పాలన అందిస్తుంటే.. ఓ ముసలి నక్క, ఆయన కొడుకు యువనక్కకు కడుపు మంటగా ఉందని వ్యాఖ్యానించారు. విశాఖలో జరిగిన వైసీపీ సభలో ఆయన ప్రసంగించారు. ‘ఆ ముసలి నక్క, యువ నక్క ఎవరో మీకు తెలుసు. 2014 నుంచి 2019 వరకు ఆ ముసలి నక్క సీఎంగా పనిచేసింది. ఐదేళ్లలో ఆ ముసలి నక్క సాధించలేదని.. ఈ ప్రభుత్వం ఐదు నెలల్లో సాధిస్తోందని కడుపు మంట. రాబోయే ఎన్నికల్లో ఆ ముసలి నక్క పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ యువనక్క సమర్థత మీద ప్రజల్లో నమ్మకం లేదు. టీడీపీని చంద్రబాబు గొంతుపిసికి చంపేస్తున్నారు.’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

  మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు... ఇప్పుడు పార్టీని గొంతు పిసికి చంపేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని బీజేపీలో కలిపేస్తున్నారని విమర్శించారు. మరో ఇంట్లో బతకడానికి బాబు రెడీ అయ్యారని అందుకు టీడీపీని పణంగా పెట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఒకప్పుడు జాతీయ నాయకుడిగా ఉన్నచంద్రబాబునాయుడు ఇప్పడు ఒక ‘జాతి’ నాయకుడిగా మారిపోయారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటిలను చంద్రబాబే బీజేపీలోకి పంపారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ‘సుజనాచౌదరి నుంచి వల్లభనేని వంశీ వరకు పరిశీలిస్తే.. టీడీపీ భవిష్యత్ ఏంటో అర్థం అవుతుంది.’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

  చంద్రబాబు అసలు పుత్రుడు లోకేష్ మంగళగిరిలో ఒక్కచోట ఓడిపోతే, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రయోగించిన రామబాణానికి చంద్రబాబు ఐదు నెలల క్రితమే నేల కూలారని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే, రావణకాష్టంలా అప్పుడప్పుడు లేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఓ ముగిసిన అధ్యాయం అని అన్నారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: AP Politics, Chandrababu Naidu, Nara Lokesh, Vijayasai reddy

  ఉత్తమ కథలు