హోమ్ /వార్తలు /national /

Target Kuppam: కుప్పం క్లీన్ స్వీప్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహం.. పరువు కోసం టీడీపీ ప్రయత్నం.. చంద్రబాబు పర్యటన తరువాత ఏం జరగబోతోంది..?

Target Kuppam: కుప్పం క్లీన్ స్వీప్ టార్గెట్‌గా వైసీపీ వ్యూహం.. పరువు కోసం టీడీపీ ప్రయత్నం.. చంద్రబాబు పర్యటన తరువాత ఏం జరగబోతోంది..?

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్

Target Kuppam: వైసీపీ కళ్లన్నీ ఇప్పుడు మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంపైనే పడింది. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. దీంతో అక్కడ పరువు కాపాడుకోవడం ప్రతిపక్ష నేతకు ఇజ్జత్‌ కా సవాల్ గా మారింది. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్ నెలకొంది.

ఇంకా చదవండి ...

Chandra Babu vs Peddireddy Fight in Kuppam: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో రాజకీయం మళ్లీ హీటెక్కింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Telugu Desam

Party Chief Chandrababu Naidu) కు సొంత నియోజకవర్గం కుప్పం (kuppam)లో మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్ష అవుతోంది. చంద్రబాబు నాయుడుకు తన సొంత నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోవడం ఇజ్జత్‌ కా సవాల్ గా మారింది. మున్సిపల్ వార్‌లో డూ ఆర్ డై సిట్యుయేషన్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ (ycp) క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై చంద్రబాబుని ఒంటరిగా నిలపింది. మళ్లీ ఇప్పుడు మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections)నైనా సైకిల్ సత్తా చాటుతుందా? లేక మళ్లీ ఫ్యాన్‌ హవానే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తి పెంచుతోంది. చిత్తూరు జిల్లా (Chitoor District)కుప్పంలో మున్సిపల్ వార్ ఓ రేంజ్‌లో ఉంటుందనేది స్పష్టమవుతోంది. సొంత గడ్డపై చంద్రబాబుకి మరో భారీ ఓటమిని రుచి చూపించాలని వైసీపీ ఉవ్వీళ్లూరుతోంది. అటు కనీసం ఈ ఎన్నికల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.

ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు కేడర్‌కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్‌లోకి దింపారు మంత్రి పెద్దిరెడ్డి (Minster Peddy Reddy. దీంతో పరిస్థితి చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి (Chandra Babu vs Peddireddy) అన్నట్లుగా మారింది. నామినేషన్‌ల ప్రక్రియ పూర్తయ్యాక కుప్పంలోనే మకాం వేయాలని మంత్రి పెద్దిరెడ్డి భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీ లోనూ క్లీన్ స్వీప్ చేయాలన్నది ఆయన టార్గెట్. మరోవైపు YCP దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నది టీడీపీ లక్ష్యంగా పెట్టుకుని కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది.

ఇదీ చదవండి: బద్వేల్‌ లో ఓడింది టీడీపీ-జనసేన.. ప్రతిపక్షాల మాటలను జనం నమ్మడం లేదన్న మంత్రి

ఈ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దండయాత్ర చేసింది. చాలా చోట్ల టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. ఈ దెబ్బతో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కదిలిందా అన్నపరిస్థితిలోకి వెళ్లిపోయింది తెలుగుదేశం పార్టీ. ఘోర పరాజయంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆత్మస్థైర్యం దెబ్బతింది. దీంతో ఈ మధ్యే కుప్పంలో పర్యటించారు చంద్రబాబు. రోడ్‌షో ద్వారా బలప్రదర్శన చేశారు. టీడీపీ బలం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గింపు.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే.?

ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. అటు వైసీపీ కూడా ఇప్పటికే ప్లానింగ్ మొదలు పెట్టింది. పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేసింది. సీనియర్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు.. సో కుప్పంలో ఇప్పటికే హైవోల్టేజ్‌ క్రియేట్ అయింది. మరి మొన్నటి చంద్రబాబు టూర్ సక్సెస్ అయ్యిందా.. లేదా.. అన్నది రాబోయే మున్సిపల్ ఎన్నికలతో తేలిపోనుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Kuppam, Municipal Elections, Peddireddy Ramachandra Reddy

ఉత్తమ కథలు