హోమ్ /వార్తలు /national /

మూడు రాజధానులపై శాసనమండలిలో మళ్లీ ‘రచ్చ’... టీడీపీ కొత్త ఎత్తు...

మూడు రాజధానులపై శాసనమండలిలో మళ్లీ ‘రచ్చ’... టీడీపీ కొత్త ఎత్తు...

ఏపీ అసెంబ్లీ భవనం

ఏపీ అసెంబ్లీ భవనం

మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి ఏపీ శాసనమండలిలో మళ్లీ రచ్చ కొనసాగింది.

    మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి ఏపీ శాసనమండలిలో మళ్లీ రచ్చ కొనసాగింది. గతంలో ఈ రెండు బిల్లులను శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపారు. అయితే, తాజాగా నిన్న ఏపీ అసెంబ్లీలో ఆ రెండు బిల్లులను మరోసారి ఆమోదించి మండలికి పంపింది ప్రభుత్వం. వాటిపై చర్చించాలని ఆర్థిక మంత్రి, మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. అయితే, మొదట ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించాలని మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ యనమల డిమాండ్ చేశారు. ద్రవ్య వినిమయ బిల్లు రాజ్యాంగపరమైన తప్పనిసరి కాబట్టి మొదట దానిపై చర్చించాలని, ఆ తర్వాత సమయాన్ని బట్టి మిగిలిన వాటిపై ఆలోచించవచ్చన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కూడా ద్రవ్యవినిమయ బిల్లుపై మొదట చర్చిద్దామన్నారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ మంత్రులు అభ్యంతరం తెలిపారు. మొదట సీఆర్డీఏ, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపైనే చర్చించాలని డిమాండ్ చేశారు. అలాగే, ద్రవ్య వినిమయ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన బిల్లులు ప్రవేశపెట్టిన సంప్రదాయం ఎప్పడూ లేదన్నారు. కాబట్టి, తొలుత ఈ రెండు బిల్లులపై చర్చించి, ఆ తర్వాత చివర్లో ద్రవ్య వినియమ బిల్లు పెట్టాలన్నారు. గతంలో ఎప్పుడూ ద్రవ్య వినిమయ బిల్లును ముందుగానే చర్చించిన సందర్భాలు లేవన్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో సభ వాయిదా పడింది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Ap capital, Ap legislative council, Crda

    ఉత్తమ కథలు