దేశం ఓ వైపు టెక్నాలజీలో పరుగులు పెడుతున్నా... మహిళలపై మూఢనమ్మకాల పేరుతో అమానుషాలు.. జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం.. ఆధునిక యుగంలో కూడా జనం మూఢనమ్మకాల్ని వీడటం లేదు.ఇంకా బాబాల పేరుతో మోసపోతూనే ఉన్నారు. క్షుద్రపూజలు... చేతబడుల పేరుతో అమానుషాలు ఏదో ఓ చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. పిల్లలు పుడతారని... కుటుంబ సభ్యులే ఒక మహిళకు మనిషికి ఎముకల పొడిని తినిపించారు.
మరెన్నో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఈ కేసు విరవాలను పుణె సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ సుకైల్ శర్మ వెల్లడించారు. పుణె ప్రాంతానికి చెందిన బాధితురాలు తన అత్తింటి వారిపై రెండు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అమావాస్య రాత్రుల వేళ శ్మశానాలకు తనను తీసుకెళ్లేవారని.. అక్కడ ఆస్తికల్ని తినిపించేవారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొందని తెలిపారు. చేతబడి చేసే వ్యక్తి చెప్పడంతో అలా చేశారని ఆమె తెలిపింది. ఒక జలపాతం కింద చేతబడి చేయించినట్లు బాధితురాలు పోలీసులకు పేర్కొంది. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి తీసుకెళ్లి అఘోర పూజలు చేయించినట్లు ఆమె తెలిపింది.
మాంత్రికుడు వీడియో కాల్ చేసి సూచనలు చేసే వాడని ఆమె వివరించింది. 2019లో పెళ్లి సమయంలో భర్త అతని తమ్ముళ్లు కట్నం డిమాండ్ చేసినట్లు మరో ఫిర్యాదు చేసింది. నిందితులంతా బాగా చదువుకున్న వారేనని కానీ క్షుద్ర పూజల్ని అనుసరించారని పోలీసులు చెప్పారు. బాధితురాలు భర్త, అతడి తమ్ముళ్లు, చేతబడులు చేయించిన వ్యక్తి సహా ఏడుగురిపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేసినట్లు పోలీసులు చెప్పారు, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని.. వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Maharashtra, Maharastra news'