హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అద్వానీ బ్లాగ్‌పై మెహబూబా రియాక్షన్.. ఆ మాటేదో ఇన్నాళ్ల నుంచి ఎందుకు చెప్పలేదు?

అద్వానీ బ్లాగ్‌పై మెహబూబా రియాక్షన్.. ఆ మాటేదో ఇన్నాళ్ల నుంచి ఎందుకు చెప్పలేదు?

బీజేపీ భక్తులు ప్రతిపక్షాలను దేశ ద్రోహులు అంటుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అద్వానీ ఇప్పుడు స్పందించడమేంటని మెహబూబా ప్రశ్నించారు. ఎన్నికలు సమీపించినవేళ మాట్లాడటం కాదని.. ఈ మాటలు గత ఐదేళ్లలోనే అద్వానీ మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఇంకా చదవండి ...

  బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కె అద్వానీ తన బ్లాగ్‌లో రాసుకున్న అభిప్రాయాలపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందించారు. 'మొదట దేశం, తర్వాత పార్టీ, చివరగా నువ్వు' అన్న అద్వానీ వ్యాఖ్యలపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఒక్క మాట మాట్లాడని అద్వానీ ఇప్పుడిలా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు.

  మా జాతీయతా దృక్పథంలో రాజకీయంగా విబేధించేవాళ్లను ప్రత్యర్థులుగా తప్ప శత్రువులుగా మేమెప్పుడూ చూడలేదు. ప్రత్యర్థులైనంత మాత్రాన వారేమి దేశ ద్రోహులు కారు. బీజేపీని స్థాపించిన నాటి నుంచి ఇదే పంథాను అవలంభిస్తున్నాం.
  ఎల్‌కె అద్వానీ బ్లాగ్

  బీజేపీ భక్తులు ప్రతిపక్షాలను దేశ ద్రోహులు అంటుంటే.. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న అద్వానీ ఇప్పుడు స్పందించడమేంటని మెహబూబా ప్రశ్నించారు. ఎన్నికలు సమీపించినవేళ మాట్లాడటం కాదని.. ఈ మాటలు గత ఐదేళ్లలోనే అద్వానీ మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా, కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి ఆధారపడి ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న వాదనపై మెహబూబా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. 2020 నాటికి దాన్ని తొలగించాలని చూస్తున్నారని.. అదే జరిగితే.. భారత్‌తో తమ బంధం తెగిపోతుందని ఆమె అన్నారు. పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయెల్‌ లాగా భారత్ కూడా దురాక్రమణదారుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీకి బీజేపీకి మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

  First published:

  Tags: Jammu and Kashmir, Jammu And Kashmir Lok Sabha Elections 2019, Jammu S09p06, LK Advani, Mehbooba Mufti

  ఉత్తమ కథలు