హోమ్ /వార్తలు /national /

AP Politics: జగన్‌కు ఆ ఎమ్మెల్యే షాకిస్తారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న మాజీమంత్రి

AP Politics: జగన్‌కు ఆ ఎమ్మెల్యే షాకిస్తారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్న మాజీమంత్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP News: విధానపరంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళుతున్న సమయంలో తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందన్నది ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి అనుమానమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ అధికార పార్టీకి కొన్ని చోట్ల తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు చేసింది. ప్రతి ఒక్క లోక్‌సభ సెగ్మెంట్‌ను ఓ జిల్లాగా మారుస్తామని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. అదే అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఈ విధానంలో ఎక్కువగా మార్పులు చేయడానికి ఆయన సిద్ధపడటం లేదు. ఒక్క చోట మార్పులు చేయడం మొదలుపెడితే.. ఇక ఆ మార్పులకు ముగింపు ఉండదని.. ప్రతి ఒక్కరూ మార్పులు, చేర్పుల కోసం పట్టుబడతారని అధికార పార్టీ భావిస్తోంది. అందుకే ఈ విషయంలో సొంత పార్టీ నేతల అభిప్రాయాలను సైతం జగన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది ఓ వాదన. తాజాగా తన నియోజకవర్గం కందుకూరును ప్రకాశం జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కలపడాన్ని మాజీమంత్రి, కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  దశాబ్దాల పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడం పట్ల స్థానికంగా అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సైతం పార్టీ నాయకత్వాన్ని కలిసి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. సీఎం జగన్‌తో ఆయనకు రెండుసార్లు అపాయింట్‌మెంట్ ఓకే అయ్యిందని.. అయితే చివరి నిమిషంలో వివిధ కారణాల వల్ల మళ్లీ అది రద్దు అయ్యిందని సమాచారం. మహీధర్ రెడ్డి ఈ అంశంపై మాట్లాడేందుకు సమయం తీసుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఆయనను కలవడం లేదేమో అనే చర్చ కూడా సాగుతోంది.

  నెల్లూరు లోక్‌సభ సెగ్మెంట్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాలు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. అందులో ఉన్న ఒక్క కందకూరు మాత్రమే ప్రకాశం జిల్లాలో ఉంది. దీనికి తోడు కందుకూరుకు నెల్లూరు కంటే ఒంగోలు దగ్గరగా ఉంటుంది. ఇది కూడా కందుకూరు ప్రజలు నెల్లూరులో చేరేందుకు ఆసక్తి చూపకపోవడానికి మరో కారణమనే వాదన ఉంది. ఈ విషయంలో ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి కూడా ప్రజల డిమాండ్‌కే కట్టుబడి ఉన్నారని కొందరు చెబుతున్నారు.

  MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్యలో ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం.. లోక్‍సభ స్పీకర్‌కు సునీతారెడ్డి లేఖ..

  AP Assembly: మార్చి 7నుంచి.. అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ వ్యూహం ఇదేనా..? శపథం మాటేంటి..?

  విధానపరంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళుతున్న సమయంలో తమ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అంగీకరిస్తుందన్నది ఆయన అనుమానమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపవద్దని జరుగుతున్న నిరసనలు మహీధర్ రెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయని.. ఒకవేళ ఈ విషయంలో స్పందించకపోతే భవిష్యత్తులోనూ ఇబ్బందులు వస్తాయనే ఆందోళన ఆయన వర్గంలో కనిపిస్తోందని కందుకూరు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

  ఉత్తమ కథలు