హోమ్ /వార్తలు /national /

K Chandrashekar Rao: రేపు కేసీఆర్ ఏం చెబుతారు ? ఆ సస్పెన్స్‌కు తెర దించుతారా ? నేతల్లో ఉత్కంఠ

K Chandrashekar Rao: రేపు కేసీఆర్ ఏం చెబుతారు ? ఆ సస్పెన్స్‌కు తెర దించుతారా ? నేతల్లో ఉత్కంఠ

Nagarjuna Sagar By election: టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాత సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని తమ పార్టీ తరపున అభ్యర్థిని ఎంపికచేయాలని బీజేపీ యోచిస్తోంది.

  తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై సస్పెన్స్ నెలకొంది. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి ఆయన కుటుంబసభ్యులను పోటీ దింపుతారా లేక కొత్త నేతను తెరపైకి తీసుకొస్తారా ? అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే రేపు నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని హాలియాలో సీఎం కేసీఆర్ హాజరుకానున్న బహిరంగ సభలో దీనిపై ఓ స్పష్టత వస్తుందా ? అని టీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు. రేపు హాలియలో జరిగే సీఎం సభకు సాగర్ ఉప ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదని, ఎడమ కాలువ పై 60 ఏళ్లుగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

  అయితే ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సభ ఉండటంతో.. ఈ నియోజకవర్గానికి ఆయన మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇదే సభలో టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనే దానిపై కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు సంకేతాలు ఇవ్వొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత విజయం సాధించి ఉంటే... నాగార్జునసాగర్‌లోనూ కచ్చితంగా నోముల నర్సింహయ్య కుటుంబంలో ఒకరికి టీఆర్ఎస్ టికెట్ ఖాయమని అంతా అనుకునేవారు.

  కానీ దుబ్బాకలో అలా జరగకపోతే... నోముల నర్సింహయ్య కుమారుడికి టీఆర్ఎస్ టికెట్‌పై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దింపుతుందనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాత సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని తమ పార్టీ తరపున అభ్యర్థిని ఎంపికచేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇక కాంగ్రెస్ తరపున జానారెడ్డి లేదా ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.

  First published:

  Tags: CM KCR, Nagarjuna Sagar By-election, Telangana

  ఉత్తమ కథలు