హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Congress: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్.. మరిన్ని ట్విస్టులు ఉంటాయా ? అదే జరిగితే..

Congress: కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్.. మరిన్ని ట్విస్టులు ఉంటాయా ? అదే జరిగితే..

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (ఫైల్)

Congress President Elections: దిగ్విజయ్ సింగ్ తరువాత కూడా మరికొందరు నేతలు ఈ రేసులో నిలుస్తారా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజస్థాన్ రాజకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. అశోక్ గెహ్లాట్ పేరుపై అనుమానం ఉండగా, గాంధీ కుటుంబానికి(Gandhi Family) చెందిన మరో సన్నిహిత నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh)పేరు ఇప్పుడు తెరపైకి వస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్‌కు సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది. మరో మాజీ ఎంపీ ఎంపీ అర్జున్ సింగ్(Arjun Singh) సహాయంతో రాజకీయాల్లో విజయం సాధించారు. దీని తర్వాత పివి నరసింహారావు క్యాంపులో చేరినట్లు చెబుతున్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పరిగణించబడ్డాడు.

  బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను తీవ్రంగా విమర్శించే వారిలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. గతంలోనూ ఆయన ఇలాంటి పలు వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపింది. ఒక్కోసారి కాంగ్రెస్ కూడా అసౌకర్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంత జరిగినా గాంధీ కుటుంబానికి దిగ్విజయ్‌ సింగ్‌ అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్(Congress) మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. రాహుల్ గాంధీకి దిగ్విజయ్‌ను రాజకీయ గురువుగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

  దిగ్విజయ్ సింగ్ 1969లో రఘోఘర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా రాజకీయాలను ప్రారంభించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రాజీవ్ గాంధీ కాలం నుండి గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వసనీయ వ్యక్తులలో దిగ్విజయ్ సింగ్ ఒకరు. రాజీవ్ గాంధీకి మధ్యప్రదేశ్ అధికారాన్ని అప్పగించారు. సోనియాగాంధీని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలుగుతున్న నేతల్లో దిగ్విజయ్ సింగ్ ఒకరు.

  దిగ్విజయ్ సింగ్ 1993 నుండి 2003 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2003 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, పదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి సంక్షోభంలో కూరుకుపోయింది కాబట్టి దిగ్విజయ్ సింగ్ ఆ పార్టీని ఎలా బయటికి తీసుకువస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజయం సాధిస్తే.. ఆయన వ్యవహార శైలి, 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై ఆయన దృష్టి సారిస్తారు.

  Congress: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్..రసవత్తరంగా అధ్యక్ష ఎన్నికలు..సోనియా మద్దతు ఎవరికి?

  Supreme Court: తీవ్రమైన నేరారోపణలున్న నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధిస్తారా?

  అయితే దిగ్విజయ్ సింగ్ తరువాత కూడా మరికొందరు నేతలు ఈ రేసులో నిలుస్తారా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే.. అప్పుడు పోటీలో ఉన్న నాయకుల్లో గాంధీ కుటుంబం మద్దతు ఎవరికి ఉంటుందనే అంశం ఆసక్తికరంగా మారుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ జోక్యం ఉండదని గాంధీ కుటుంబం పదే పదే చెబుతున్నప్పటికీ.. ఆ కుటుంబం మద్దతు ఉన్న నాయకుడే ఆ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దిగ్విజయ్‌, శశిథరూర్‌తో పాటు ఇంకెవరైనా నాయకులు రేసులో ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష రేసు మరింత సంక్లిష్టంగా మారుతుందనే చర్చ జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Digvijaya Singh

  ఉత్తమ కథలు