హోమ్ /వార్తలు /national /

Revanth Reddy: రేవంత్ రెడ్డి రూటు మారుతుందా ?..ఆ కీలక భేటీపైనే అందరి దృష్టి

Revanth Reddy: రేవంత్ రెడ్డి రూటు మారుతుందా ?..ఆ కీలక భేటీపైనే అందరి దృష్టి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆయన రాకతో తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని విశ్వాసంగా ఉంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి.

హుజూరాబాద్ ఉప ఎన్నికల తరువాత తెలంగాణ రాజకీయాల్లో లెక్కలు మారిపోయాయి. పార్టీల బలాబలాల్లో కూడా మార్పులు వచ్చాయని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయనే చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ కలిగించింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కావడంతో ఆ పార్టీ దశ మారుతుందని అంతా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు రాకపోగా.. మరింత దిగజారిందని కొందరు సీనియర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతమే నిదర్శమని వాదిస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై రేవంత్ రెడ్డి పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఈ రకమైన ఫలితాలు వచ్చాయనే ఊహాగానాలు కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ ఫలితాలపై సీరియస్‌గా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్.. ఈ నెల 13న దీనిపై సమీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హుజూరాబాద్‌లో పోటీ చేసిన అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను ఢిల్లీ పిలిచినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఎందుకు తయారైందనే దానిపై పూర్తి నివేదికతో ఢిల్లీ రావాలని ఈ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ భేటీలో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చర్చిస్తుందనే అంశాన్ని పక్కనపెడితే.. ఈ భేటీ ప్రభావం ఎక్కువగా రేవంత్ రెడ్డి మీదే ఉండొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన కాంగ్రెస్ నాయకత్వం.. ఆయన రాకతో తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని విశ్వాసంగా ఉంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో పరిస్థితితో మార్పు రావడం లేదని.. దీనికి తోడు కాంగ్రెస్ పరిస్థితి మరింత తీసికట్టుగా తయారవుతోందని అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్ష తరువాత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కీలక సూచనలు చేస్తుందనే చర్చ కూడా సాగుతోంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?

Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని.. వాటి గురించి పార్టీలో చర్చించడం లేదని కాంగ్రెస్‌లోని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. హైకమాండ్‌తో భేటీ తరువాత దీనిపై రేవంత్ రెడ్డికి కీలక ఆదేశాలు రావొచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ భేటీ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లివచ్చిన తరువాత ఆయన పనితీరును బట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు కీలక సూచనలు చేసిందో లేదో తెలుస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నికల ఎఫెక్ట్.. టీఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీనే ఇబ్బందిపెడుతున్నట్టు కనిపిస్తోంది.

First published:

Tags: Congress, Huzurabad, Revanth Reddy, Telangana

ఉత్తమ కథలు