హోమ్ /వార్తలు /national /

పరిటాల ఫ్యామిలీ దారెటు... పార్టీ మారతారా ?

పరిటాల ఫ్యామిలీ దారెటు... పార్టీ మారతారా ?

అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని ఆకర్షించగలిగితే టీడీపీని దెబ్బ కొట్టవచ్చనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. పరిటాల ఫ్యామిలీతో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ చర్చలు కూడా జరిపారని సమాచారం.

    ఏపీలో వైసీపీ భారీ విజయం తరువాత టీడీపీలో కొంత నైరాశ్యం నెలకొంది. ఇంత ఘోరంగా పార్టీ ఓటమి పాలవుతుందని ఊహించలేకపోయిన టీడీపీ నేతలు... ఇతర పార్టీల వైపు చూస్తున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏపీపై బీజేపీ ఫోకస్ పెట్టిందని... టీడీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు ఊహాగానాలు వచ్చాయి. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత పరిటాల సునీత బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. పరిటాల రవి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. 2005లో పరిటాల రవి హత్య అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన సునీత... అప్పటి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పరిటాల సునీత... 2019లో తాను పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు.

    అయితే దశాబ్దాల పాటు పార్టీని నమ్ముకున్న తమ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వాలని ఆయన పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం పరిటాల కుటుంబానికి ఒకే సీటు కేటాయించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో తన కుమారుడు శ్రీరామ్ పొలిటికల్ ఎంట్రీ కోసం పరిటాల సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. మరోవైపు ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత బీజేపీ ఏపీపై ఫోకస్ చేసిందని... ఈ క్రమంలోనే పరిటాల కుటుంబంతో చర్చలు జరిపిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబాన్ని ఆకర్షించగలిగితే టీడీపీని దెబ్బ కొట్టవచ్చనే ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. పరిటాల ఫ్యామిలీతో బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్ చర్చలు కూడా జరిపారని సమాచారం. అయితే అంతకుముందే పరిటాల ఫ్యామిలీ వైసీపీలోకి వెళుతుందనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ పరిటాల కుటుంబానికి చెందిన సన్నిహితులు మాత్రం... ఆ కుటుంబం టీడీపీతోనే ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలపై పరిటాల కుటుంబం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

    First published:

    Tags: Anantapur S01p19, Bjp, Cm jagan, Paritala sunitha, Ram Madhav, TDP, Ysrcp

    ఉత్తమ కథలు