హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

సోనియాకు సారీ..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన గెహ్లాట్

సోనియాకు సారీ..కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన గెహ్లాట్

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(ఫైల్ ఫొటో)

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లట్(ఫైల్ ఫొటో)

Ashok Gehlot On Congress President Election : అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Ashok Gehlot On Congress President Election : అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అశోక్ గెహ్లాట్ ప్రకటన తర్వాత రాజస్తాన్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఈ విషయాన్ని గెహ్లాట్ వెల్లడించారు. రెండు రోజుల క్రితం రాజస్తాన్ లో జరిగిన ఘటనలు తమను షాక్​కు గురి చేశాయని..తాను ముఖ్యమంత్రి పదవి వీడాలనుకోవట్లేదని ఇంప్రెషన్ అందరిలో ఏర్పడిందని..రాజస్తాన్ పరిణామాలపై సోనియాకు క్షమాపణ చెప్పానని గెహ్లాట్ తెలిపారు. తాను గత 50 ఏళ్లుగా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్​ సైనికుడిగానే పనిచేశానని అన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని తాను స్వాగతిస్తున్నానని గెహ్లాట్ అన్నారు. తమది ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదని, సహోద్యోగుల మధ్య స్నేహపూర్వక పోటీ అని తామిద్దరం అంగీకరించామని అన్నారు. తమకు కావలసింది ఎవరు గెలిచినా కాంగ్రెస్ గెలవడమేనని గెహ్లాట్ చెప్పారు. కాగా,ఇవాళ సాయంత్రం రాజస్తాన్ కాంగ్రెస్ లో కీలక నాయకుడైన సచిన్ పైలట్..సోనియాగాంధీతో సమావేశం కానున్నట్లు సమాచారం.

కాంగ్రెస్​ పార్టీ కొన్ని నెలల క్రితం ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవి((One man-One post)లో ఉండాలని తీర్మానించింది. "ఒక వ్యక్తి, ఒకపదవి" అనే నియమాన్ని కాంగ్రెస్ అనుసరిస్తుందని ఇటీవల రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన జాతీయ పాత్రకు వెళ్లడానికి గత వారం అంగీకరించారు. కేరళలో భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని గత వారం కలిసిన అనంరం కొచ్చిలో విలేఖరులతో గెహ్లాట్ మాట్లాడుతూ తాను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఆదివారం రాజస్తాన్ లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. గెహ్లాట్ కి వన్ మ్యాన్-వన్ పోస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని,లేదు సీఎంని మార్చాలనుకుంటే 2020లో సచిన్ పైలట్ తో కలిసి తిరుగుబాటు చేసిన 18మంది ఎమ్మెల్యేలలను కాకుండా గెహ్లాట్ వర్గంలోని ఒకరిని సీఎం చేయాలన్న డిమాండ్ డిమాండ్ తో గెహ్లాట్ వర్గానికి చెందిన 90కి పైగా ఎమ్మెల్యేలు స్పీకర్ ని కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు.

Indian States : భారత్ లోని ఆ రాష్ట్రాల్లో పర్యటించొద్దు..కెనడా పౌరులకు ఆ దేశం హెచ్చరిక

దీంతో పర్యవేక్షణ కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అజయ్‌ మాకెన్‌, ఏఐసీసీ పరిశీలకుడు మల్లికార్జున్‌ ఖర్గే జైపూర్‌ చేరుకున్నారు. ఎమ్మెల్యేలను విడివిడిగా కలిసి వారితో మాట్లాడేందుకు ఢిల్లీ నుంచి జైపూర్ కి వచ్చిన మల్లిఖార్జున ఖర్గే,అజయ్ మాకెన్ లను కూడా ఎమ్మెల్యేలు కలవలేదు. దీంతో వారు వెంటనే ఢిల్లీకి తిరుగుయనమ్యారు. ఈ క్రమంలో రాజస్తాన్ పరిణామాల పట్ల హైకమాండ్ సీరియస్ అయింది. గెహ్లాట్..రాజస్తాన్ పరిణామాలకు అధిష్ఘానినికి క్షమాపణ చెప్పినప్పటికీ...ఆయనే ఎమ్మెల్యేలను అధిష్ఠానంపైకి ఉసిగొల్పి తిరుగుబాటు చేయించాడని గాంధీ ప్యామిలీ భావించింది. ఆయన్ను అధ్యక్షుడిని చేస్తే పార్టీ శ్రేణులకు, నేతలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Ashok Gehlet, Ashok gehlot, Congress, Congress President Elections, Sonia Gandhi

ఉత్తమ కథలు