హోమ్ /వార్తలు /national /

నిమ్మగడ్డ ఇష్యూను సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం.. విజయసాయిరెడ్డి

నిమ్మగడ్డ ఇష్యూను సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం.. విజయసాయిరెడ్డి

విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)

తాను చనిపోయేంత వరకు వైసీపీలోనే ఉంటా.. వైఎస్ జగన్‌తోనే ఉంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన పదవీకాలన్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చి ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దు చేయడంతో.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. హైకోర్టు తీర్పుపై అంసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంపై విషం గక్కుతున్నారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ లేకపోయినా తమ మనుషులు ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి. నిమ్మగడ్డ రమేశ్‌కు అనుకూలంగా తీర్పు వస్తే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. న్యాయవ్యవస్థపై వైసీపీకి పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు.

ఇక ఏపీ సీఎం జగన్ మంగళవారం వెళ్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. హోంమంత్రి అమిత్ షా పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలు తన పేరు తో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి తమ నాయకుడి పైనే తప్పుడు పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు భరోసా ఇస్తున్నామని..వారికి ఏం జరిగినా అండగా ఉంటామని చెప్పారు. తాను చనిపోయేంత వరకు వైసీపీలోనే ఉంటా.. వైఎస్ జగన్‌తోనే ఉంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy, Nimmagadda Ramesh Kumar, Vijayasai reddy, Ysrcp

ఉత్తమ కథలు