Home /News /national /

POLITICS WILL MOVE OUT OF TELANGANA BJP MLA RAJA SINGH COMMENTS ON ANTI CAA RESOLUTION SK

రాజీనామా చేసి..తెలంగాణ నుంచి వెళ్లిపోతా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

రాజాసింగ్

రాజాసింగ్

రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. ఆయన తీర్మాన ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.

    తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ వ్యతిరేక చట్టానికి తీర్మానం సందర్భంగా సభలో గందరగోళం చెలరేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ.. బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అంతేకాదు తెలంగాణను విడిచి వెళ్లిపోతానని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదని.. ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. NPR, NRC, CAA వల్ల దేశంలోని ఏ పౌరుడికీ నష్టం జరగదని చెప్పినా.. అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్ మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేయడంతో.. ఆయన తీర్మాన ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు.


    రాజాసింగ్ వ్యవహారంపై మాట్లాడిన సీఎం.. ఇది జరుగుతూనే ఉంటుందని స్పీకర్‌‌కు చెప్పారు. అన్ని పక్షాలు చెప్పిన అభిప్రాయాలను నోట్ చేసుకున్నామని, సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కోరారు. అనంతరం ఓటింగ్ నిర్వహించి సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యులు మద్దతు తెలిపారు. పౌరసత్వ చట్టానికి (CAA) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన 8వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కేబినెట్ ఫిబ్రవరి 16న ఈ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించగా.. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. కాగా, సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటికే మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు తమ అసెంబ్లీల్లో తీర్మానం చేశాయి
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, CAA, CM KCR, Raja Singh, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు