హోమ్ /వార్తలు /national /

Dubbaka: దుబ్బాకపై కాంగ్రెస్ ఫోకస్.. ఉత్తమ్ కీలక ప్రకటన

Dubbaka: దుబ్బాకపై కాంగ్రెస్ ఫోకస్.. ఉత్తమ్ కీలక ప్రకటన

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Dubbaka By election: దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా పరిహారం చెల్లించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానంపై కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఇక్కడ నుంచి పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికపై ఇందిరా భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. దుబ్బాక ఉప ఎన్నికను చారిత్రాత్మకమైనదిగా భావిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. ఉప ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలవాలని ఆయన సూచించారు. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నామని... రాష్ట్ర నాయకత్వం మీ వెంటే ఉంటుందని వారికి సూచించారు.

  రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని కార్యకర్తలతో ఉత్తమ్ వ్యాఖ్యానించారు.. దీనిపై ఇప్పటికే కొంత కొంత గ్రౌండ్ వర్క్ చేశామని వెల్లడించారు. పోటీలో ఎవరుంటే బాగుంటుందన్న దానిపై కార్యకర్తలు సూచించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా పరిహారం చెల్లించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి భవనం , చేనేత , బీడీ కార్మికులను కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మండల కమిటీలను మూడు రోజుల్లో పూర్తి చేయాలని.. ఆ తర్వాత గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కష్టపడితే దుబ్బాకలో మంచి ఫలితాలు వస్తాయని ఆయన కార్యకర్తలకు సూచించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Dubbaka By Elections 2020, Telangana, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు