క్రికెటర్ రవీంద్ర జడేజా నెల రోజు క్రితం బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు జడేజా సోదరి, తండ్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్‌లోని జామ్ నగర్ జిల్లా కలావడ్ నగరంలో జరుగుతున్న కాంగ్రెస్ ర్యాలీలో జడేజా తండ్రి అనిరుద్ సిన్హ్ జడేజా, సోదరి నయనబా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొన్నారు. పాటిదార్ రిజర్వేషన్ పోరాట సమితి నేత హార్దిక్ పటేల్, జామ్ నగర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ములు కండోరియా సమక్షంలో వారు హస్తం పార్టీలో చేరారు. రైతులు, మహిళలు, యువతకు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నయనబా జడేజా ఆరోపించారు.
మార్చి 3వ తేదీన రవీంద్ర జడేజా భార్య రివాబా సోలంకి జడేజా మోదీ జామ్ నగర్ పర్యటన సందర్భంగా బీజేపీలో చేరారు. ఐదు నెలల క్రితం జడేజా భార్య రివాబా కర్ణిసేన మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పద్మావతి సినిమా విడుదలను ఆపాలంటూ కర్ణిసేన పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసింది. రవీంద్ర జడేజా, రివాబాకి 2016లో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె. జడేజాకు రాజ్‌కోట్‌లో ఓ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ వ్యవహారాలు ఆమె చూసుకుంటూ ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Pm modi