విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్‌లో పర్యటించారు. కేజీహెచ్‌లో బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అయితే, జగన్ విశాఖ టూర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కనిపించకపోవడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు విజయసాయిరెడ్డి విమానంలో ఎక్కేందుకు జగన్ నిరాకరించారని కూడా ప్రచారం జరిగింది. అయితే, విశాఖలో విజయసాయిరెడ్డి ఎందుకు కనిపించలేదో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరణ ఇచ్చారు. బాధితులను పరామర్శిచేందుకు సీఎం జగన్ హెలికాప్టర్లో బయలుదేరినప్పుడు, ఎంపీ విజయసాయిరెడ్డి తన స్థానాన్ని నాకు ఇచ్చారని ఆళ్ల నాని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన తన మీద గౌరవంతో విజయసాయిరెడ్డి తనకు సీటు ఆఫర్ చేశారని, దీనిపై కూడా కొందరు విష ప్రచారం చేస్తున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు. కొందరికి విశాఖ ప్రమాదం కన్నా నీచ రాజకీయాలే ముఖ్యం అయ్యాయన్నారు.
సీటు కోసం వెన్నుపోటు, హత్యా రాజకీయాలు చేసే టీడీపీలో ఇలా తన సీటును వేరొకరికి ఇచ్చే సంస్కారం ఎవరికీ లేదన్నారు. వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డిది ఆత్మీయ అనుబంధం అని, ఆయన అంకిత భావం, చిత్తశుద్ధి శంకించలేనిదన్నారు. ప్రజాసేవకోసం సీఎం జగన్ ఆదేశాలను విజయసాయిరెడ్డి తూ.చా తప్పక అమలు చేస్తారని ఆళ్ల నాని అన్నారు. మాటమీద నిలబడ్డ నాయకుడి వెంటే నడుస్తున్నారని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Vijayasai reddy, Vizag gas leak