హోమ్ /వార్తలు /national /

బీజేపీకి రాజాసింగ్ షాక్ : ఎల్బీ స్టేడియంలో మోదీ సభకు డుమ్మా!

బీజేపీకి రాజాసింగ్ షాక్ : ఎల్బీ స్టేడియంలో మోదీ సభకు డుమ్మా!

బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (File)

బీజేపీ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (File)

Rajasingh gives Modi's meeting a Miss : ఎన్నికల వేళ రాజాసింగ్ మోదీకి సభకు గైర్హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వంతో ఆయనకు పొసగట్లేదా? పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రధాని మోదీ సభకు డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం జరిగిన బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర నాయకత్వమంతా హాజరు కాగా.. రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం హాజరుకాలేదు. ఎన్నికల వేళ రాజాసింగ్ మోదీకి సభకు గైర్హాజరవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వంతో ఆయనకు పొసగట్లేదా? పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


  అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ముందు నుంచి రాజాసింగ్‌కు సఖ్యత లేదనే చెప్పాలి. పార్టీ నాయకత్వం నిర్వహించే సభలు, సమావేశాలకు ఆయన దూరంగానే ఉంటూ వస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రాజాసింగ్‌కు మధ్య విభేదాలు ఎందుకొచ్చాయో తెలియదు గానీ.. ఇరువురి మధ్య ఆ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన ఈ సభకు ఆయన దూరంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది.


  ఇటీవలే కరీంనగర్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి తరుపున ప్రచారంలోనూ రాజాసింగ్ పాల్గొన్నారు. కాబట్టి ఆయన పార్టీ మారుతారన్న వాదన వట్టి ఊహాగానాలే అన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన పార్టీ మారాలన్నా.. ఆయన భావజాలానికి తగ్గ పార్టీ మరొకటి రాష్ట్రంలో లేదనే చెప్పాలి. అటు మజ్లిస్‌తో దోస్తీ ఉన్న టీఆర్ఎస్ కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు లేవు. ఇక ఇప్పటికే నేతల వలసలతో ఉనికిని కాపాడుకునేందుకు కష్టపడుతున్న కాంగ్రెస్‌లోకి ఆయన వెళ్తారని భావించలేం. కాబట్టి రాజాసింగ్ మోదీ సభకు హాజరుకానంత మాత్రానా పార్టీ మారుతారని భావించాల్సిన అవసరం లేదన్న వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది.

  First published:

  Tags: Bjp, Hyderabad S29p09, Lok Sabha Election 2019, Narendra modi, Raja Singh, Telangana Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు