గుజరాత్ లో రెండు దశల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. అంతా ఊహించినట్టుగానే మరోసారి గుజరాత్ పప్రజలు బీజేపీకే పట్టం కట్టినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. Tv9 ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గుజరాత్ లో బీజేపీకి 125-130, కాంగ్రెస్ కు 40-50, ఆప్ కు 03-05, ఇతరులకు 03-07 వరకు సీట్లు వస్తాయని తెలుస్తుంది.
JAN KI BAAT : బీజేపీకి 117-140, కాంగ్రెస్ కు 34-51, ఆప్ కు 6-13, ఇతరులకు 01-02 సీట్లు
JAN KI BAAT-INDIA NEWS EXIT POLL :
CONGRESS PROJECTED TO GET ITS LOWEST SEAT SHARE TALLY IN GUJARAT. #GujaratAssemblyPolls #ExitPollWithPradeep #ExitPollOnIndiaNews @pradip103 @IndiaNews_itv pic.twitter.com/HcmeZtOnAg — Jan Ki Baat (@jankibaat1) December 5, 2022
P-MARQ: బీజేపీ 128-148, కాంగ్రెస్ 30-42, ఆప్ 02-10, ఇతరులు 0-3
#LIVE | Republic-@pmarq_ Exit Poll projects big win for BJP in Gujarat; Congress & AAP predicted to lag far behind; Tune in here - https://t.co/za2VLiJ3Z9 pic.twitter.com/qRfMbRhC8S
— Republic (@republic) December 5, 2022
గుజరాత్ (Gujarat) చివరి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రెండో విడతలో పోలింగ్ శాతం 59గా నమోదు అయింది. కాగా రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు (Gujarat Elections) జరగగా..మొదటి దశలో 89 స్థానాలకు..రెండో దశలో 93 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 833 మంది అభ్యర్థులు తమ భవితవ్యం ఈ ఎన్నికలతో ముడిపడి ఉంది. ప్రధానంగా బీజేపీ , కాంగ్రెస్, ఆప్ మధ్య పోరు నెలకొంది. కాగా డిసెంబర్ 8న ఫలితాలను వెల్లడించనున్నారు. తొలి దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 70 మంది మహిళలు ఉండగా.. 339 మంది స్వతంత్ర అభ్యర్ధులున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో (Gujarat Assembly Elections) రెండో విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక అహ్మదాబాద్ లోని రానిప్ ఉన్నత పాఠశాలలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అతని కొడుకు జైషా ఓటు వేశారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్, సోదరుడు సోమాభాయ్ మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ గవర్నర్ ఆనంది బెన్, బీజేపీ అభ్యర్థి హార్దిక్ పటేల్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఓటు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.