POLITICS WHO IS THE STATE ELECTION COMMISSIONER OF AP ACCORDING TO HIGHCOURT ORDER PAGE 318 SK
ఏపీ ఎన్నికల కమీషనర్ ఎవరు? తీర్పు కాపీ 318 పేరా ప్రకారం ఆయనేనా..
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, కనగరాజ్(ఫైల్ ఫోటో)
హైకోర్టు తీర్పు కాపీలోని 317,318 పేరాలను పరిశీలిస్తే గతంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కాలపరిమితిని తగ్గిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు మాజీ చీఫ్ జస్టిస్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామిస్తూ ఇచ్చిన ఆర్డినేషన్లను పక్కన పెట్టాం అంటే రద్దు చేశాం అని పేర్కొన్నారు.
(బాలకృష్ణ, న్యూస్ 18 ప్రతినిధి)
దేశమంతటా కరోనా గురించి టెన్షన్ నెలకుంటే.. ఏపీలో మాత్రం కరోనాతో పాటు నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం సెగలు రేపుతోంది. రాష్ట్ర ఎన్నిలక అధికారిగా నిమ్మగడ్డ రమేష్ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో అసలు గందరగోళం మొదలయింది. కోర్టు తీర్పు తర్వాత అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలోకి వచ్చారా? రాలేదా? అనే దానిపై కన్ఫ్యూజన్ నెలకొంది. జగన్ ప్రభుత్వం నియమించిన ఎన్నికల కమిషనర్ కనకరాజు కొనసాగుతారా? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
హై కోర్టు ఉత్తర్వులు ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం కనకరాజు ఏపీకి ఎన్నికల కమిషనర్ కాదు. ప్రభుత్వం ఆర్డినేషన్ ద్వారా తొలిగించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీకి ఎన్నికల కమిషనర్ అవుతారు అని తన తీర్పులో పేర్కొంది హైకోర్టు. అయితే ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఎన్నికల కమిషన్ కార్యదర్శి నుంచి అడ్వకేట్ జనరల్‌కి ఉత్తర్వులు వెళ్లాయి. దీనిపై అడ్వకేట్ జనరల్ అభ్యంతరాలు చెప్పడంతో ఆ ఉత్వర్వులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా బాధ్యతలు చేపట్టవచ్చా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అసలు హైకోర్టు తీర్పులో ఏముందనే అంశం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. హైకోర్టు తీర్పు కాపీలోని317,318 పేరాలను పరిశీలిస్తే గతంలో ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కాలపరిమితిని తగ్గిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్‌తో పాటు మాజీ చీఫ్ జస్టిస్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియామిస్తూ ఇచ్చిన ఆర్డినేషన్లను పక్కన పెట్టాం అంటే రద్దు చేశాం అని పేర్కొన్నారు. దాంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా రద్దు అయినట్లు అయింది. అయితే అందరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ తన బాధ్యతలు చేపట్ట వచ్చు అని అనుకున్నారు. కానీ 318 పేరాలో నిమ్మగడ్డకు మళ్లీ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చే వరకు.. ఇక్కడ నిమ్మగడ్డ నేరుగా వెళ్లి తన బాధ్యతలు తీసుకోవడానికి వీలులేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది.
ప్రస్తుతం 318 పేరాలో ఉన్న అంశాలు చాలా కీలకంగా మారాయి. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డకు బాధ్యతలు ఇచ్చే కార్యక్రమాలు పూర్తి చేయాలి. అయితే సహజ న్యాయ సూత్రాలు ప్రకారం నిమ్మగడ్డ తన బాధ్యతలు తీసుకోవడానికి ప్రయత్నించడం కోర్టు తీర్పుకు వ్యతిరేకం. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పై కోర్టుల్లో అప్పీల్ చేసుకోనే అవకాశం ఉన్నప్పుడు.. అక్కడ తేలే వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు తానుగా ఏం చేయడానికి వీలులేదు. ఒక వేళ పై కోర్టు స్టే విధిస్తే.. కోర్టులో పంచాయతీ తేలే వరకు నిమ్మగడ్డ ఎదురు చూడాల్సిందే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ అంశం తేలే వరకు ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమీషనర్ కనకరాజే ఉంటారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.