Lalu about nitish kumar: బీహార్(Bihar)లో పాత మిత్రులు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu prasad yadav),నితీష్ కుమార్(Nitish kumar) మళ్లీ దగ్గరయ్యారు. వీరి ఆధ్వర్యంలోని రెండు పార్టీలు అంటే రాష్ట్రీయ జనతాదళ్(RJD)-జనతాదళ్ యునైటెడ్(JDU)చేతులు కలిపి మళ్లీ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే లాలూ, నితీష్ మధ్య రాజకీయ స్నేహం, శత్రుత్వం సుదీర్ఘ ప్రయాణంగా సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటారు,అంతేస్థాయిలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటారు. కాగా, ఇటీవలే లాలూ ఆత్మకథ "గోపాల్‌గంజ్ సే రైసినా" ప్రచురించబడింది. అది కూడా బాగా పాపులర్ అయింది. బుక్ కాపీలు భారీగా అమ్ముడయ్యాయి కూడా. ఇందులో లాలూ రాజకీయ ప్రయాణం, ఆ సమయంలో తెరపైకి వచ్చిన విషయాలను వివరించారు. ఈ పుస్తకంలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించినప్పటికీ, ఒక పూర్తి అధ్యాయం బీహార్ ప్రస్తుత ఆపద్దర్మ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గురించి ఉంది.
లాలూ ఆత్మకథలో 11వ అధ్యాయం ఛోటా భాయ్ నితీష్ పేరుతో ఉంది. అందులో లాలూ ఇలా రాశారు..“ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే నితీష్‌తో నా మొదటి సమావేశం. నేను అతనిని ఎక్కువగా కలిసిన జ్ఞాపకం లేదు, ఎందుకంటే అతను ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి మాత్రమే. నేను పూర్తి రాజకీయ కార్యకర్తగా మారాను. ఆ సమయంలో అతను సాధారణ, తెలియని వ్యక్తిగా చూడబడ్డాడు. నేను బీహార్‌లో సోషలిస్టు ఉద్యమానికి ప్రముఖ యువ ముఖం.
Bihar Updates : నితీశ్ అనే నేను.. 8వ సారి సీఎంగా ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వీ.. 7పార్టీలకూ పదవులు..
ఈ విషయంలో నితీష్‌కి రుణపడి ఉంటాను
“కర్పూరీ ఠాకూర్ మరణానంతరం బీహార్ శాసనసభలో నేను(లాలూ) ప్రతిపక్ష నాయకుడిగా నా వాదనను సమర్పించినప్పుడు అతను(నితీష్) నాకు మద్దతు ఇచ్చినందుకు నేను ఆయనకు రుణపడి ఉంటాను. కానీ కాలక్రమేణా అతను మారిపోయాడు. సైద్ధాంతికంగా, అతను ఊగిసలాడుతున్నాడు. దీని తరువాత అతను జార్జ్ ఫెర్నాండెజ్ శిబిరానికి వెళ్ళాడు. దీని తరువాత అతని గురువుతో అతని సంబంధం బాగా లేదని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. చాలా ఏళ్ల భాగస్వామ్యం తర్వాత ఆ పార్టీకి కూడా దూరమయ్యారు. ఆ తర్వాత మాతో అంటే ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలోకి వెళ్లారు.
అప్పుడు నితీష్ నాకు ఫోన్ చేశాడు
ఈ ఆత్మకథలో లాలూ ఇలా వ్రాశాడు... "2014 లోక్ సభ ఎన్నికలలో గెలిచిన తర్వాత బీజేపీ నితీష్ యొక్క జేడీయూ పార్టీని నాశనం చేసింది, జూన్ 2014 రాజ్యసభ ఉపఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులు పవన్ కె వర్మ, గులాం రసూల్ బలియావికి ఇబ్బందిని సృష్టించింది. వారు నన్ను కలిసి మా అభ్యర్థులను గెలిపించడానికి మీ పార్టీ మద్దతు కావాలి అని కోరారు. RJD ఎమ్మెల్యేలు.. వర్మ, బలియావికి అనుకూలంగా ఓటు వేశారు, వారిని గెలిపించారు.
నితీష్, మోదీ మధ్య సంబంధాలపై
వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నితీష్ ఎన్‌డీఏ శిబిరంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు అన్నది రహస్యమేమీ కాదు. నితీష్, మోదీ మంచి మిత్రులయ్యారు. మొత్తానికి మోదీని సమర్థించడంలో అద్వానీ లాంటి వారికి అండగా నిలిచి ముఖ్యమంత్రిగా ఉండేలా చూసుకున్నారు. నేను అతని ప్రధాన ప్రత్యర్థిని, బీహార్‌లో నా స్థాయిని తగ్గించాలని నితీష్ కోరుకున్నాడు. గుజరాత్ హింస గురించి అతను ఏదైనా మాట్లాడతాడని ఆశించడం పనికిరానిది. ఇది కాకుండా 1999లో రైల్వే మంత్రి అయిన తర్వాత నితీష్ బీజేపీ ఛాందసవాదులతో పొత్తు పెట్టుకున్నారు అని లాలూ నితీష్ గురించి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.