హోమ్ /వార్తలు /national /

PM Kisan Scheme | కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో కొత్త రూల్స్... రైతులూ ఈ నియమాలు పాటించండి...

PM Kisan Scheme | కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో కొత్త రూల్స్... రైతులూ ఈ నియమాలు పాటించండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PM KISAN Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇకపై... ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.

  PM Narendra Modi Kisan Samman Nidhi scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నాలుగో విడత మనీ ఈ నెలలోనే రైతుల అకౌంట్లలోకి రానుంది. 2019 ఫిబ్రవరి 24న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో మొదటిసారిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఒకేసారి కోటి మంది రైతుల బ్యాంక్ అకౌంట్ల లోకి రూ.2000 చొప్పున డబ్బు డిపాజిట్ చేశారు. దాంతో చిన్న, సన్నకారు రైతులు ఆ డబ్బుతో విత్తనాలు, ఎరువులు కొనుక్కొని వ్యవసాయం చేసుకున్నారు. ఇలా ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం మూడుసార్లు రూ.2000 చొప్పున డబ్బు ఇచ్చింది. తద్వారా రైతులు ఏడాదికి పండించే మూడు పంటలకూ ఎంతో కొంత ఆర్థిక సాయం లభిస్తున్నట్లు అయ్యింది. అందువల్ల రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బు అప్పు తీసుకోకుండా కేంద్రం ఇచ్చే ఉచిత నిధులను ఉపయోగించుకోగలుగుతున్నారు. అందువల్ల దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం కోసం రూ.75000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు కూడా ఈ స్కీం ద్వారా... నాలుగో విడత డబ్బులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఐతే... రైతులు తప్పనిసరిగా... తమ బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఉండాలి. రైతులు ఎవరైనా లింక్ చేసుకోకపోతే... వీలైనంత త్వరగా లింక్ చేసుకోవడం మేలు. ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 14 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిసింది.

  కిసాన్ మాన్ ధన్ స్కీం గురించి తెలుసా? : ప్రధాని నరేంద్ర మోదీ... చిన్న, సన్నకారు రైతుల కోసం కిసాన్ మాన్ ధన్ స్కీంని జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించారు. ఇదేంటంటే... దీని ద్వారా 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ రానుంది. ఐతే... రైతుల వయసు 60 ఏళ్లు నిండి ఉండాలి. 18 ఏళ్లు నిండి... 40 ఏళ్లలోపు వయసు ఉండే రైతులు ఈ స్కీం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చు. అలా అప్లై చేసుకున్న రైతు పేరున ఓ అకౌంట్ తెరుస్తారు. ఈ అకౌంట్‌కి రైతు... ప్రతీ నెలా రూ.55 నుంచీ రూ.200 వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రీమియం ఎంత అన్నది రైతు ఇందులో చేరినప్పుడు అతను లేదా ఆమెకు ఎంత వయసు ఉందో, దాన్ని బట్టీ నెలకు ఎంత చెల్లించాలో డిసైడ్ చేస్తారు. తక్కువ వయసు ఉండే రైతులు తక్కువ ప్రీమియం, ఎక్కువ వయసు ఉండే రైతులు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా సరే 60 ఏళ్లు వచ్చే వరకూ ఇలా చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఎంత చెల్లిస్తారో, కేంద్రం కూడా అంత మొత్తం తనవైపు నుంచీ చెల్లిస్తుంది. 60 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాత... నెలకు రూ.3000 పింఛను పొందగలరు.

  ఇక ఇప్పటివరకూ రైతులు తమ పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.లక్ష వరకూ అప్పు పొందే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు కేంద్రం ఈ అప్పును రూ.1.60 లక్షలకు పెంచింది. ఇలా ఎక్కువ మొత్తం పొందాలంటే... పొలం తాకట్టుతోపాటూ... ఎవరిదైనా హామీ కూడా తప్పనిసరి. పొలం ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు ఎవరు పొలంలో ఏ పంట పండిస్తున్నారు? వంటి వివరాలు కూడా ఇవ్వా్ల్సి ఉంటుంది.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: PM Kisan Scheme, PM Narendra Modi, Pradhan Mantri Kisan Samman Nidhi

  ఉత్తమ కథలు