ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అత్యంత సంతృప్తినిచ్చాయనే చెప్పుకోవాలి. మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా..నాగాలాండ్, త్రిపురలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించగా..మేఘాలయాలో మాత్రం అధికారం దక్కించుకోలేకపోయింది. కానీ గతంలో కంటే ఓ సీటు ఎక్కువగా సాధించడం ఊరటనిచ్చే అంశం. అయితే నాగాలాండ్ లో అధికార పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీతో కలిసి బీజేపీ కూటమి ద్వారా మెజారిటీ సాధించింది. అక్కడ పొత్తు ద్వారానే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా మేఘాలయ తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు కారణం మోదీ మేనియా, బీజేపీ విధానాలే కారణమని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపకపోవడం గమనార్హం.
హిందుత్వ పార్టీగా బీజేపీకి పేరుంది. కానీ నాగాలాండ్ లో గిరిజనులు, క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ అధికార పార్టీ కూటమితో బీజేపీ జెండా రెపరెపలాడనుంది. నాగాలాండ్, త్రిపురలో బీజేపీ గెలుపుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ అంశం ప్రజల్లో సానుకూల ధోరణిని తీసుకొచ్చింది. అలాగే అక్కడి స్థానిక నేతలతో మంచి సంబంధాలను బీజేపీ కొనసాగించడంతో కాషాయ పార్టీకి కారణాలుగా తెలుస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ , నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో నాగాలాండ్ బీజేపీ-ఎన్డీపీపీ కూటమి, త్రిపురలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించగా..మేఘాలయాలో ఎవరికీ కూడా స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. అక్కడ సీఎం కాన్రాడ్ సగ్మా నేతృత్వంలోని NPP అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 స్థానాలను ఏ పార్టీ సాధించేలేదు.
త్రిపురలో భారతీయ జనతా పార్టీ 32 స్థానాలను గెలుచుకొని అధికారాన్ని నిలబెట్టుకోగా..నాగాలాండ్ లో ఎన్డిపీపీ-బీజేపీ కూటమి 37 స్థానాలు గెలుచుకుని (25+12) అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక మేఘాలయలో అధికార పార్టీ 25 స్థానాలను గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 స్థానాలను ఏ పార్టీ కూడా సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాలలో మెరుగైన ఫలితాలను రాబట్టింది. త్రిపుర అసెంబ్లీని వరుసగా రెండోసారి కైవసం చేసుకోగా..నాగాలాండ్ లో కూటమితో అధికారం చేపట్టడం లాంఛనమే. ఇక మేఘాలయాలో హంగ్ ఏర్పడినప్పటికీ కూడా గత ఎన్నికల కంటే ఓ స్థానం ఎక్కువగా సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం..
త్రిపుర ఫలితాలు..
బీజేపీ - 32
త్రిపా మోతా- 13
సీపీఎం- 11
కాంగ్రెస్ - 3
ఏపీఎఫ్.టి- 1
నాగాలాండ్ ఫలితాలు..
ఎన్డీపీపీ- 25
బీజేపీ- 12
ఎన్డీపీపీ-బీజేపీ కూటమి= (25+12= 37)
ఎన్సీపీ- 7
ఎన్పీపీపి- 5
స్వతంత్రులు- 4
ఎల్.జేపీ- 2
ఆర్.పిఐ- 2
ఎన్.పిఎఫ్- 2
జేడీయూ- 1
మేఘాలయ ఫలితాలు..
ఎన్.పీపీ- 25
యూడీపీ- 11
కాంగ్రెస్- 5
టిఎంసి- 5
విపీపీ- 4
బీజేపీ- 3
హెచ్.ఎస్.పీడీపీ- 2
పీడిఎప్- 2
స్వంతంత్రులు- 2
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.