హోమ్ /వార్తలు /national /

కేశినేనిపై చిర్రెత్తిపోయిన పీవీపీ.. ఇంటికొచ్చి పళ్లు రాలగొడుతానని వార్నింగ్..

కేశినేనిపై చిర్రెత్తిపోయిన పీవీపీ.. ఇంటికొచ్చి పళ్లు రాలగొడుతానని వార్నింగ్..

కేశినేని నాని,పీవీపీ(File Photos)

కేశినేని నాని,పీవీపీ(File Photos)

Kesineni Vs PVP : నాని ట్వీట్‌పై స్పందించిన పీవీపీ.. 'Mr. MP, RECESSION స్పెల్లింగ్ కూడా రాని వాడివి, మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్!' అంటూ కౌంటర్ ఇచ్చారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని,వైసీపీ నేత పీవీపీ మధ్య ట్విట్టర్‌ వార్ జరిగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. మొదట ఎంపీ నాని భారత ఆర్థికమాంద్యంపై ట్వీట్ చేయగా.. పీవీపీ దానికి కౌంటర్ ఇచ్చారు.'దేశంలో ఆర్థిక మందగమనం ఉన్నవేళ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేయడానికి ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి.ఇలాంటి తరుణంలో అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తే ఆర్థికంగా అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయారు.'అంటూ కేశినేని ట్వీట్ చేశారు. నాని ట్వీట్‌పై స్పందించిన పీవీపీ.. 'Mr. MP, RECESSION స్పెల్లింగ్ కూడా రాని వాడివి, మా కర్మ కాకపోతే, నీకెందుకయ్యా, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్!' అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు,మీవల్ల ఆర్థికంగా దివాళా తీసే స్థితికి వచ్చిన రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో చెబుతారా? అంటూ ప్రశ్నించారు.

తన ట్వీట్‌పై నాని కౌంటర్ ఇవ్వడంతో.. 'ఆర్థిక నేరస్తులు కూడా పాఠాలు చెప్పే స్థాయికిఎదిగారని భావిస్తున్నారంటే.. అది తప్పకుండా రాష్ట్రానికి పట్టిన కర్మే' అని అసహనం వ్యక్తం చేశారు. నాని చేసిన ఈ ట్వీట్‌‌పై చిర్రెత్తిపోయిన పీవీపీ.. 'చదువు సంధ్య లేని బజారు మనుషులు కూడా మాట్లాడడం మన తెలుగు ప్రజల కర్మ.ఇష్యూ డైవర్ట్ చెయ్యకు,కావాలంటే ఇంగ్లీష్, తెలుగు ట్యూషన్ మాస్టర్స్ పంపిస్తాను! పిచ్చి వాగుడు కట్టిపెట్టి,వొళ్ళు వంచి పనిచేయరా బడుద్దాయ్!లేదంటే,నీ ఇంటికొస్తా,నీ ఆఫీసుకొస్తా,ఎక్కడున్నా వచ్చి నీ పళ్ళు రాలగొడతా!' అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఇలా ఈ ఇద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ వార్ బెజవాడలో హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Kesineni Nani, PVP, Vijayawada

ఉత్తమ కథలు