హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

VOX Populi-Parliamentarians Debate 2022: పట్టణీకరణతో రెండంకెల వృద్ధి సాధ్యమా..!? డిబేట్‌లో ఎంపీలు ఏమన్నారంటే..?

VOX Populi-Parliamentarians Debate 2022: పట్టణీకరణతో రెండంకెల వృద్ధి సాధ్యమా..!? డిబేట్‌లో ఎంపీలు ఏమన్నారంటే..?

VOX Populi - Parliamentarians Debate 2022

VOX Populi - Parliamentarians Debate 2022

VOX Populi - Parliamentarians Debate 2022: వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్‌లో ‘‘VOX పాపులి - పార్లమెంటేరియన్స్ డిబేట్’’ నిర్వహించారు. ఇందులో పట్టణీకరణతో రెండంకెల వృద్ధి సాధ్యమా అనే అంశంపై ఎంపీ సూచనలు చేశారు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్‌లో ‘‘VOX పాపులి - పార్లమెంటేరియన్స్ డిబేట్’’ నిర్వహించారు. దీనిలో ఇక్కడ

డైలాగ్, ఫ్రీ వీలింగ్ డిబేట్‌లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు, పట్టణీకరణతో రెండంకెల వృద్ధి సాధ్యమా అనే అంశంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. చర్చలో ఎంపీలు ప్రజల జీవితాలు మెరుగుపడే విధంగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనే అంశాలపై చర్చించారు. ఉపయోగపడే ఇన్‌పుట్స్ ఇచ్చారు.

Pm Modi: జీ-20 సదస్సుకు ప్రధాని మోదీ ..అధికారిక ప్రకటన రిలీజ్..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తోనూ భేటీ అయ్యే ఛాన్స్

డైలాగ్, ఫ్రీ వీలింగ్ డిబేట్‌..

డెహ్రాడూన్‌లో వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్‌ (Valley of Words International Literature and Arts Festival)లో ‘‘VOX పాపులి - పార్లమెంటేరియన్స్ డిబేట్’నిర్వహించారు. దీనిలో డైలాగ్, ఫ్రీ వీలింగ్ అంశంపై ఆదివారం చర్చ జరిగింది. ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులుహాజరయ్యారు. వారిలో బీజేపీకి చెందిన డాక్టర్ అశోక్ బాజ్‌పాయ్, వివేక్ తంఖా (కాంగ్రెస్), సంత్ బల్బీర్ సీచెవాల్ (AAP)మనోజ్ ఝా (RJD),డా. అమర్ పట్నాయక్ (బిజెడి), కె. కేశవ రావు (టిఆర్‌ఎస్),డా. వి. శివదాసన్ (CPIM),లావు శ్రీ కృష్ణ దేవరాయలు (YSRC)చర్చలో పాల్గొన్నారు.

ఉపయోగకరమైన చర్చ..

ఈ ప్యానెలిస్ట్‌ (panelists)లు చర్చనీయాంశంపై ముఖ్యమైన సలహాల సూచనలు అందించారు. పాలన సమస్యలు, జనాభా మరియు ప్రాంతీయ సమతుల్యత , సంస్కరణలపై ఎంపీలు వారి దృక్పథం తెలియజేశారు. కాగా, ఈ చర్చ( Phygital way) ( భౌతికం, డిజిటల్ మార్గంలో​) జరిగింది. ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ (YouTube) ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. రాజీవ్ రంజన్ శ్రీవాస్తవ చర్చలో ముఖ్యమైన సమాచారాన్ని అందించారు.

ఎంపీల అభిప్రాయాలు ..

టీఆర్ఎస్‌ ఎంపీ కే.కేశవరావు ప్రజల అవసరాలు, ప్రాంతాల అభివృద్ది చెందాలంటే ముందు దేశ ఆర్ధిక వృద్ది రేటు పెరగాలన్నారు. అలాగే అభివృద్ది ఫలాలు అన్నీ ప్రాంతాలకు సరిసమానంగా విభజించబడాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఇంటర్‌నెట్‌ సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం ద్వారా పరిశ్రమలు వస్తాయని, పారిశ్రామిక అభివృద్ధి చెందుతున్నారు. ఏపీకి చెందిన వైసీపీ లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రస్తుతం ఉన్న సవాళ్లను అధిగమించి అవకాశాలకు కల్పిస్తే ప్రతిఫలం ఉంటుందన్నారు. అలాగే 'పట్టణీకరణతో రెండంకెల వృద్ధి సాధ్యమా అనే విషయంపై తమ అవగాహన మేరకు సలహాలు ఇచ్చారు.

Viral video: సాధారణ వ్యక్తి కాళ్లు మొక్కిన బ్రిటర్ ప్రధాని అత్తగారు .. వైరల్ అవుతున్న సుధా మూర్తి వీడియో

డెహ్రాడూన్‌లోని ఇంటర్నేషనల్ లిటరేచర్ & ఆర్ట్స్ ఫెస్టివల్, చరిత్రకారుడు, పాలసీ అనలిస్ట్ , ఫెస్టివల్ డైరెక్టర్ వ్యాలీ ఆఫ్ వర్డ్స్ సంజీవ్ చోప్రా (Sanjeev chopra) మాట్లాడుతూ.. “ వ్యక్తులు , సంఘాల మధ్య చర్చలు మరియు పరస్పర చర్యల ద్వారా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. VOX పాపులి పార్లమెంటేరియన్స్ డిబేట్ అనేది వ్యాలీ ఆఫ్ వర్డ్స్ ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, ఆర్ట్స్ ఫెస్టివల్‌లో ముఖ్యమైన భాగంగా మారింది” అన్నారు.

ఈ డిబేట్‌ క్యూరేటర్, ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సామాజిక పారిశ్రామికవేత్త డాక్టర్ అమ్నా (Social Entrepreneur Dr Amna) ఈ అంశంపై మాట్లాడుతూ.. ఇలాంటి చర్చలో పాల్గొనడం వల్ల సమర్థవంతమైన విమర్శనాత్మక ఆలోచన ఏర్పడుతుందని (generates effective critical thinking), ఇది విభిన్న కళాత్మక మరియు సాంస్కృతిక వ్యక్తీకరణలకు చాలా ముఖ్యమైనదని అభిప్రాయం వ్యక్తంచేశారు.

First published:

Tags: Delhi news

ఉత్తమ కథలు