హోమ్ /వార్తలు /national /

Vizag Steel Plant: మార్చి 25 నుంచి నిరవధిక సమ్మె! 26న భారత్ బంద్

Vizag Steel Plant: మార్చి 25 నుంచి నిరవధిక సమ్మె! 26న భారత్ బంద్

ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. కేంద్ర  నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బంద్, భారత్ బంద్ కు కూడా విశాఖ స్టీల్  కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చారు. ఆమరణ దీక్షలు, రిలే నిరహారా దీక్షలు, బీచ్ వాక్, పాద యాత్రలు ఇలా వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు కార్మికులు. అయినా కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేతనాల పెంపు డిమాండ్ తో పాటు, ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపు ఇచ్చాయి.

ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బంద్, భారత్ బంద్ కు కూడా విశాఖ స్టీల్ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చారు. ఆమరణ దీక్షలు, రిలే నిరహారా దీక్షలు, బీచ్ వాక్, పాద యాత్రలు ఇలా వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు కార్మికులు. అయినా కేంద్రం వెనక్కు తగ్గకపోవడంతో కార్మిక సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వేతనాల పెంపు డిమాండ్ తో పాటు, ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపు ఇచ్చాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఉక్కు పరిరక్షణ సమితి ఇంకాస్త దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇవాళ పరిపాలన భవనం ముట్టడికి పిలుపు ఇచ్చిన నిర్వాసితులు, కార్మిక సంఘాలు.. మార్చి 25 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సిద్ధమైంది.

ఇంకా చదవండి ...

విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్రమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను తక్షణమే ఆపేసి, విశాఖ ఉక్కుకు సొంత గనుల కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూర్మన్న పాలెం జంక్షన్ నుండి స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వరకు సాగిన ఈ ర్యాలీకి భారీగా కార్మికులు, ఉక్కు నిర్వాసితులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. 

స్టీల్ ప్లాంట్ కు సంస్థాగత ఘనులు కేటాయిస్తే లాభాల భాట పడుతుందని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. 2016 వరకు లాభాల బాటలో నడిచిన స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని పెంచడం, బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం వంటి కారణాలు నష్టాల బాటలో నడిచేటట్లు చేశాయని కార్మికులు మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న ఉక్కు నిర్వాసితులకు ఇంత వరకు పర్మినెంటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో స్టీల్ ప్లాంట్ మిగులు భూములను వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని వార్గాల వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. 

మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పలు రూపాల్లో నిరసన తెలియజేస్తున్న కార్మిక సంఘాలు.. ఈ నెల26న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి. ఈ భారత్ బంద్ విజయవంతం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు తీర్మానించాయి. భారత్ బంద్ తోపాటు, ఈ నెల 20 స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ లో స్టీల్ కార్మిక గర్జన సభ, ఈ నెల 23, 24 తేదీల్లో జోనల్ స్థాయిలో ధర్నాలు చేపట్టాలని, అలాగే 28వ తేదీన ఉత్తరాంధ్ర సభ నిర్వహించాలని.. ఈ నెల 30నుంచి జీవీఎంసీ గాంధీ విద్రహం దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. మరోవైపు ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మెకు దిగాలని కార్మికులు నిర్ణయించారు. కొంతమంది నిరవధిక సమ్మె చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అందరితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

ఇప్పటికే కార్మికులు నిరసనలు తీవ్ర చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు.. కార్మికులను అడ్డుకున్నారు. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభించనున్నారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన తమకు ఇప్పటికే న్యాయం జరగలేదని 64 గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికీ సాయం అందలేదని 8500 మంది నిర్వాసితులు ఈ ర్యాలీ నిర్వహించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు