హోమ్ /వార్తలు /national /

Vizag Steel Plant: విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం? తెలంగాణ మంత్రికి జై కొడుతున్న ఆంధ్రా జనం

Vizag Steel Plant: విశాఖలో కేటీఆర్ కు పాలాభిషేకం? తెలంగాణ మంత్రికి జై కొడుతున్న ఆంధ్రా జనం

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి నాయకుడు దొరికాడా? అయితే కొందరు కార్మికులు మాత్రం తమకు తెలంగాణ లీడరే కావాలి అంటున్నారు. ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్న.. కేటీఆర్ లాంటివారే తమ ఉద్యమాన్ని ముందు ఉండి నడపాలని కోరుతున్నారు.

విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమైంది. అయితే ఇంతకాలానికి తమకు సరైన నాయకుడు దొరికాడు అంటున్నాయి కార్మిక సంఘాలు. దాదాపు నెల రోజుల నుంచి విశాఖలో ఆందోళనలు మిన్నంటుతున్నా.. కేవలం అది ఆంధ్రాకు మాత్రమే పరిమితం అయ్యింది. విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదం కేంద్రం చెవిని కూడా పడినట్టు కూడా లేదు. అందుకు కారణం  రాజకీయంగా ఉద్యమానికి మైలేజ్ రాకపోవడమే అనే వాదన ఉంది.

ఇప్పటి వరకు కేవలం కార్మిక సంఘాలు మాత్రమే విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. కార్మిక సంఘాలు ప్రజా, విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలుపుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో రాజకీయ పార్టీల నుంచి సరైన మద్దతు రావడం లేదు. ప్రధాన  పార్టీలు అన్నీ క్రెడిట్ తీసుకోడానికి ఉద్యమానికి జై కొడుతున్నాయి తప్ప.. కేంద్రాన్ని ఏ పార్టీ పల్లెత్తు మాట అనడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే స్థానిక రాజకీయ పార్టీలను కార్మిక సంఘాలు నమ్మడం లేదు. అన్ని పార్టీలు కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇటు వైసీపీ, అటు టీడీపీ మాత్రం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమంలో పాల్గొనడం లేదు. దీంతో ఉక్కు ఉద్యమానికి సరైన నాయకుడు కావాలి అంటూ కార్మిక సంఘాలు  ఎదురు చూస్తున్నాయి...

' isDesktop="true" id="795082" youtubeid="0uAZHjpsA-g" category="politics">

ఇలాంటి సమయంలో కేటీఆర్ ముందుకు రావడం ఉద్యమానికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అందుకే ఆయనే వచ్చి తమ ఉద్యమాన్ని ముందుకు నడపాలనే నినాదం మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ పోరాటానికి మద్దతు లభించడంతో తమ ఉద్యమం సక్సెస్ అవుతుందని భావిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఎందుకంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ స్వయంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి జై కొట్టారు. విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఉంటుందని ప్రకటించారు.. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం మనకు ఎందుకులే అని ఊరుకోలేం అన్నారు. రేపు సింగరేణిని కూడా ప్రైవేటుపరం చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కేంద్రం తీరుపై అందరూ పోడాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. అవసరమైతే కేసీఆర్ అనుమతి తీసుకుని.. విశాఖకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొంటామని అన్నారు కేటీఆర్.

ఇదీ చదవండి: తమ్ముడి కోసమే మెగాస్టార్ గళమెత్తారా? స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి చిరంజీవి జైకొట్టడానికి అదే కారణమా?

కేటీఆర్ ప్రకటపై ఆనందం వ్యక్తం చేశారు కార్మికులు... కేటీఆర్ నిర్ణయాన్ని కార్మికులతో పాటు ప్రజలకు కూడా ఆహ్వానించారు. ఇక, ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు కార్మికులు.. మరోవైపు సమ్మెబాట పడుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు.. యాజమాన్యానికి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.. దశలవారీ ఉద్యమ ప్రణాళిక నిర్ణయించింది ఉక్కు పరిరక్షణ జేఏసీ... ఇక, కేటీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు... తెలుగువారి ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

First published:

Tags: KTR, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

ఉత్తమ కథలు