హోమ్ /వార్తలు /national /

Andhra Pradesh:విశాఖలో వైసీపీకి ఊహించని షాక్.. నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా!

Andhra Pradesh:విశాఖలో వైసీపీకి ఊహించని షాక్.. నగర అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా!

విశాఖ మేయర్ ఎంపిక రాజకీయ దుమారం రేపుతోంది. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న సీనియర్లు.. అధిష్టానం నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇక నగర అధ్యక్షుడు.. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది.

విశాఖ మేయర్ ఎంపిక రాజకీయ దుమారం రేపుతోంది. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న సీనియర్లు.. అధిష్టానం నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇక నగర అధ్యక్షుడు.. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది.

విశాఖ మేయర్ ఎంపిక రాజకీయ దుమారం రేపుతోంది. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న సీనియర్లు.. అధిష్టానం నిర్ణయంపై మండిపడుతున్నారు. ఇక నగర అధ్యక్షుడు.. వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి దూకుడుగా ఉన్న వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తరువాత.. మేయర్ పదవికి ఆశావాహుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా సీటు బీసీ జనరల్ కు రిజర్వ్ అవ్వడంతో అదే సామాజికి వర్గానికి చెందని కీలక నేతలంతా ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. అయితే నగర్ వైసీపీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ కు మొదటి నుంచి అధిష్టాం నుంచి హామీ ఉన్నట్టు ప్రచారం జరిగింది.

విశాఖ కార్పొరేషన్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధిష్టానం మేయర్ ఎంపికపై ఆచితూచి అడుగులు వేసింది. చివరి వరకు మేయర్ ఎవరు అన్నది ప్రకటించకుండా అందరిలో ఆశలు పెంచుతూ వచ్చింది. బీసీ జనరల్ కు రిజర్వ్ అయినా.. బీసీ మహిళకు అవకాశం ఇచ్చింది. దీంతో వైసీపీలో ఉన్న వర్గ విబేధాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. విశాఖ తూర్పులోని 11వ వార్డుకు చెందిన గొలగాని వెంకట హరి కుమారికి మేయర్ గా అధిష్టానం అవకాశం ఇచ్చింది.

మేయర్ పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నా.. ఆ పదవి దక్కపోవడంతో నగర వైసీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ వంశీ కృష్ణ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కార్పొరేటర్‌గా అవకాశం ఇచ్చిన తన వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తానొక దురదృష్టవంతుడిని అంటూ వంశీ భావోద్వేగానికి  లోనయ్యారు. కొన్ని దుష్ట శక్తులు తనను అడ్డుకున్నాయని ఆరోపించారు. తాను ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానని చెబుతూ.. నిరసనగళం వినిపించారు. అక్కడే ఉన్న అభిమానులను వంశీ కృష్ణ శ్రీనివాస్ ఓదార్చారు. వంశీకి మేయర్ పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వర్గీయులు జీవీఎంసీ ఔట్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొందరు మహిళలు కంటతడిపెట్టుకున్నారు. సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా వంశీ అనుచరులు నినాదాలు చేశారు.

మొదట కేవలం నిరసన గళం వినిపించి ఊరుకున్న ఆయన.. తరువాత పరిణామాల క్రమంలో వైసీపీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. వైసీపీ నగర అధ్యక్ష పదవికి వంశీ కృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన అనుచరులు పోస్టులు పెట్టి హడావుడి చేశారు. వైసీపీలోని కొన్ని శక్తులు తనకు అన్యాయం చేస్తున్నాయని వంశీనే మండిపడడంతో ఆయన పార్టీకి దూరమైనట్టే అంటూ ప్రచారం జరిగింది.

అయితే వంశీ రాజీనా మా విషయం అధిష్టానం వరకు వెళ్లడంతో బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనిల ో భాగంగా తన అభిమానులకు సందేశం ఇచ్చారు వంశీ..  వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎవ్వరూ సోషల్ మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు, పోస్టింగ్ లు పెట్టవద్దని మనవిచేస్తున్నాను అంటూ కోరారు.  వీటి కారణంగా పార్టీ ప్రతిష్టకు, వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఎటువంటి వ్యాఖ్యలు, వివాదాలకు పోవద్దని అందరినీ కోరుతున్నాను అన్నారు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి నడుచుకుంటాను అని వివరణ ఇచ్చారు.

మరోవైపు గొలగాని వెంటక హరి కుమారికి మేయర్ పదవి ఇవ్వడంతో నగర వైసీీపీ నేతలు చాలామంది షాక్ అయినట్టు తెలుస్తోంది. అసలు ఆమెకు ఏ ప్రాతిపదికన పదవి ఇచ్చారో కూడా తెలియదు అంటున్నారు. పార్టీల్లో చాలామంది సీనియర్లు ఉండగా.. ఆమెకు ఎలా పదవి ఇచ్చారని ఒకరితో ఒకరు చెప్పుకుని నిట్టూర్చుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇప్పటిలో ఈ వ్యతిరేక జ్వాలలు చల్లారేలా కనిపించడం లేదు. అధిష్టానం వెంటనే అప్రమత్తమవ్వకపోతే.. విశాఖలో  వర్గ విభేదాలు తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Vijayasai reddy, Visakha, Visakhapatnam, Vizag, Ycp, Ys jagan, Ysrcp

ఉత్తమ కథలు