హోమ్ /వార్తలు /national /

ఆ రెండు అంశాలపై కేసీఆర్‌ని నిలదీసిన విజయశాంతి

ఆ రెండు అంశాలపై కేసీఆర్‌ని నిలదీసిన విజయశాంతి

హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్...ఆడపిల్ల మరణం పై స్పందించడానికి మూడు రోజులు పడుతుందా? అని ప్రశ్నించారు.

    సీఎం కేసీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి. హైదరాబాద్ దిశ ఘటనపై ప్రపంచం మాట్లాడుకుంటుంటే ఎట్టకేలకు 72 గంటలకు తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం విడ్డురంగా ఉందన్నారు. హుజుర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్...ఆడపిల్ల మరణం పై స్పందించడానికి మూడు రోజులు పడుతుందా? అని ప్రశ్నించారు. జాతీయ మీడియా ప్రశ్నించిన తరువాత ఫాస్ట్ ట్రాక్ కోర్టు పేరుతో కేసీఆర్ చేతులు దులుపుకొన్నారంటూ ఎద్దేవా చేశారు. దిశా మర్డర్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెప్పలేదన్నారు. ఆర్టీసీకి ఆదుకుంటామని చెప్పిన సీఎం..హైకోర్టు తీర్పు వచ్చిన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టీసీని కాపాడే నాధుడే లేడు అన్న కేసీఆర్... ఆర్టీసీని కాపాడేందుకు రెండు నెలల సమయం ఎందుకు పట్టింది? అని నిలదీశారు. ప్రగతి భవన్‌లో పెంపుడు కుక్కలకు ఇచ్చే విలువ తెలంగాణ సమాజానికి ఇవ్వడం లేదని విజయశాంతి మండిపడ్డారు.

    First published:

    Tags: CM KCR, RTC Strike, Shadnagar, Telangana, Telangana Politics, TSRTC Strike, Vijayashanti

    ఉత్తమ కథలు