హోమ్ /వార్తలు /national /

VijayaShanti: మలిదశ ఉద్యమానికి ఊపిరి.. దుబ్బాక ఎన్నికలపై విజయశాంతి

VijayaShanti: మలిదశ ఉద్యమానికి ఊపిరి.. దుబ్బాక ఎన్నికలపై విజయశాంతి

విజయశాంతి (ఫైల్ ఫోటో)

విజయశాంతి (ఫైల్ ఫోటో)

Vijayashanti: లక్ష మెజారిటీ ఆశించి, ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోవాలని విజయశాంతి టీఆర్ఎస్‌కు సూచించారు.

  దొరాధిపత్య దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారని కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి విజయశాంతి అన్నారు. టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత ధోరణులకు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారని అన్నారు. దుబ్బాక ఫలితాలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి.. తనదైన శైలిలో టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

  ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలన్న విజయశాంతి . దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి, ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారని తెలిపారు. లక్ష మెజారిటీ ఆశించి, ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోవాలని టీఆర్ఎస్‌కు సూచించారు. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోవాలని అన్నారు. చైతన్యపూరితమైన తెలంగాణ సమాజపు రానున్న రోజుల పోరాటాలలో ఈ దొర కుటుంబ పాలన ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని విజయశాంతి హెచ్చరించారు.

  ఇక ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న విజయశాంతి త్వరలోనే బీజేపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోనే విజయశాంతి కొనసాగేలా ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. విజయశాంతి త్వరలోనే తమ పార్టీలోకి వస్తారని.. ఆ తరువాత అనేక మంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు