వైసీపీ ముఖ్యనేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ యువనేత లోకేశ్‌పై మరోసారి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జేసీ దివాకర్ రెడ్డిని పరామర్శించేందుకు తాడిపత్రికి వచ్చిన నారా లోకేశ్ ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట అంటూ కామెంట్ చేశారు. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం అంటూ లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై కూడా విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. గంటకు 5 లక్షల ఫీజు తీసుకునే ఢిల్లీ అడ్వొకేట్ల ఇళ్ల ముందు క్యూలు కడుతున్నారట తెలుగుదేశం మాజీలు అంటూ ఎద్దేవా చేశారు. బాబు బీజేపీలోకి పంపిన కోవర్టులూ బాస్ కోసం అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఈయన కాపాడలేడు అనుకున్నారేమో ఎవరికి వారు లాయర్లకు అడ్వాన్సులిచ్చి గండం నుంచి బయట పడేయమని ప్రాధేయడుతున్నారట అంటూ వ్యాఖ్యానించారు.
తాడిపత్రి వచ్చి ఏం ఇరగదీశాడని ఆ పార్టీ కార్యకర్తలే విసుక్కుంటున్నారంట. 16 రకాల వంటకాలు చేయించుకుని సుష్టిగా భోంచేసి చెక్కేశాడని తెలుగు తమ్ముళ్లు తిట్టుకుంటున్నారు. పేరుకే పరామర్శలు, పలకరింపులు. టేస్టీ ఫుడ్ దొరుకుతుందంటే ఎంత దూరమైనా వెళ్లొస్తాడు మాలోకం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 18, 2020
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu naidu, Nara Lokesh, Vijayasai reddy