టాలీవుడ్ హాస్య నటుడు వేణు మాధవ్ తెలంగాణ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. తన స్వస్థలమైన కోదాడ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు మీడియాకు సమాచారం అందించారు. గురువారం కోదాడలో నామినేషన్ వేయనున్నట్టు వెల్లడించారు.
కాగా, వేణు మాధవ్ పుట్టి పెరిగింది కోదాడ పట్టణంలోనే. చదువుకుంటున్న రోజుల్లోనే మిమిక్రీ కళ పట్ల ఆకర్షితులై.. క్రమంగా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మారారు. వేణు మాధవ్ మిమిక్రీ ప్రదర్శనలకు మంచి పేరు రావడం.. అది కాస్త టీడీపీ దృష్టిలో పడటంతో ఆయన కెరీర్ మరో మలుపు తీసుకుంది. పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇస్తూ టీడీపీలో అందరికీ దగ్గరయ్యారు. దివంగత ఎన్టీఆర్‌తో సైతం ఆయనకు మంచి అనుబంధమే ఉంది.
ఆ తర్వాత సినీ అవకాశాలు కూడా రావడంతో వేణు మాధవ్ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఆర్టిస్ట్‌గా కొనసాగుతూనే అడపాదడపా టీడీపీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన నంద్యాల ఉపఎన్నికలోనూ టీడీపీ తరుపున ఆయన ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే, కోదాడ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, టీఆర్ఎస్ తరుపున శానంపూడి సైదిరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య వేణు మాధవ్ ఎంతమేర ప్రభావం చూపించగలడు అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana, Telangana Election 2018, Telangana News