హోమ్ /వార్తలు /national /

Vakeel saab: రాజకీయ థియేటర్ లో వకీల్ సాబ్ హిట్టా? ఫట్టా? తిరుపతిలో పేలుతున్న పొలిటికల్ పంచ్ లు

Vakeel saab: రాజకీయ థియేటర్ లో వకీల్ సాబ్ హిట్టా? ఫట్టా? తిరుపతిలో పేలుతున్న పొలిటికల్ పంచ్ లు

ఏపీలో వకీల్ సాబ్ పై పొలిటికల్ పంచ్ లు

ఏపీలో వకీల్ సాబ్ పై పొలిటికల్ పంచ్ లు

వకీల్ సాబ్ సినిమా హిట్టా ఫట్టా? అభిమానుల మాట ఎలా ఉన్నా? పొలిటికల్ గా మాత్రం సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. తిరుపతి ఉప ఎన్నికకు ముందు రిలీజ్ అయిన ఈ సినిమా పై పొలిటికల్ పార్టీలు పంచ్ లు వేసుకుంటున్నాయి.

పవన్ అభిమానులు ఊహించిందే జరిగింది. ప్రస్తుతం ఏపీలో వకీల్ సాబ్ చుట్టూ విమర్శల తూటాలు పేలుతున్నాయి. అయితే మొదటి నుంచి అభిమానులు వైసీపీ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చారు. ఏపీలో సినిమాకు ఆటంకాలు ఎదురవుతాయని భయపడ్డారు. అయితే చాలా చోట్ల అధికార పార్టీ నేతలు సినిమా విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే రాజకీయ అడ్డంకులు ఎలా ఉన్నా.. పవన్ ఫ్యాన్స్ ఊహించినట్టే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మూడేళ్ల గ్యాప్ తరువాత వచ్చిన పవన్ సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించిందనే చెప్పాలి. వకీల్ సాబ్ కు వస్తున్న టాక్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విడుదల అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో ఫ్యాన్స్ జల్సా చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. సినిమాను వివాదాలు వెంటాడాయి. అనకాపల్లి నుంచి అమీర్ పేట వరకు వకీల్ సాబ్ రిలీజ్ తో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. మూడేళ్ల తరువాత పవర్ స్టార్ ను స్క్రీన్ మీద చూసి సంబర పడిపోతున్నారు. మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీసు రికార్డులు బద్దలవ్వడం ఖాయమంటున్నారు. దాదాపు అన్ని థియేటర్ల దగ్గరా కరోనాను సైతం లెక్క చేయకుండా అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. ప్రపంచమంతా అదే పరిస్థితి ఉంటే.. ఏపీలో పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా కనిపించింది. కొన్ని జిల్లాల్లో సినిమా బెనిఫిట్ షోల విషయంలో ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తున్నారు పవన్ అభిమానులు, జనసైనికులు. ఎందుకంటే వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు ముందురోజు రాత్రి ఏపీ ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. సినిమా టికెట్లను పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ కొత్త జీవో ప్రకారం కార్పొరేషన్ ప్రాంతాల్లోని మల్టిప్లెక్స్‌ల్లో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు 250 రూపాయలు మాత్రమే ఉండాలని, మిగతా టిక్కెట్లు 150, 100 రూపాయలు మాత్రమే ఉండాలని జీవో పేర్కొంది.

తాజా జీవో ప్రకారం సింగిల్ థియేటర్ లో ఏసీ సౌకర్యం ఉంట.. అక్కడ అత్యధిక రేటు వంద రూపాయలు మాత్రమే ఉండాలి. ఏసీ లేకపోతే అక్కడ 60 రూపాయలు మాత్రమే ధర ఉండాలి. ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో కొంచెం అటూ.. ఇటూగా ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న థియేటర్లలో ఇంకాస్త తక్కువగా ఉండేలా ప్రభుత్వం నిబంధనలు సవరించింది. అయితే పవన్ సినిమా రిలీజ్‌కు ముందే ఈ జీవో విడుదల చేయడం పవర్ స్టార్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ హీరోగా తెరకెక్కిన వకీల్‌ సాబ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడం కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతిలో బెనిఫిట్ షో వేయలేదని థియేటర్ల‌పై పవన్ అభిమానలు దాడి కూడా చేశారు. కిటికీలు, సీట్లు ధ్వంసం చేశారు కూడా.

అలాగే టికెట్ రేట్ల విషయంలో థియేటర్ యజమానులు ప్రెస్ మీట్ పెట్టడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలైన వారం లేదా రెండు వారాలు టిక్కెట్ రేట్ల పెంపు చాలా కామనే. గత కొన్నేళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆ విషయం థియేటర్ యాజమాన్యాలకు తెలియని విషయం కాదు. అయినా ప్రెస్‌మీట్ పెట్టి టిక్కెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారని జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో పవన్ సినిమాల విషయంలో తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడబోమని.. కొడాలి నాని సహా పలువురు మంత్రులు, నేతలు సమయం హామీలు ఇచ్చారు. దీంతో వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు.. భారీ ఎత్తున రిలీజ్‌కు ప్లాన్ చేశారు. కానీ.. ప్రభుత్వం చివరి క్షణంలో ఇలా షాక్ ఇవ్వడం రాజకీయ కక్షే అంటున్నారు.. అలాగే అదనపు షోలు వేయడానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకపోవడం.. టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించకపోవం చూస్తే ప్రభుత్వమే సినిమాకు అడ్డంకులు కలిగించిదని ఇటే జనసేన, అటు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇటీవల కాలంలో చూస్తే కరోనా తర్వాత విడుదలైన కొన్ని సినిమాల టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు ఇటీవల ఏపీ సర్కారే అనుమతి ఇచ్చింది. కరోనా నుంచి థియేటర్ యజమానులు బయటపడేందుకు రెండు రోజుల కిందట.. ఏపీ సర్కార్ ఓ ప్యాకేజీని కూడా ప్రకటించింది. దీంతో టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు. అయితే ప్రభుత్వం పై వస్తున్న ఆరోపణలలను ఏపీ మంత్రులు ఖండిస్తున్నారు. సినిమాలో ఎలాంటి సబ్జెక్ట్ లేదని.. సినిమా హిట్టు అవ్వదనే భయంతోనే వివాదాలకు తెర తీస్తున్నారని వైసీపీ మంత్రులు, నేతలు ఆరోపిస్తున్నారు. పాచిపోయిన సినిమా తీశారంటూ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఏపీలో బెనిఫిట్ షోకు టికెట్లు కొనేవారే లేకపోవడంతో.. సినిమా హైప్ కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. ఇటు ఈ వివాదంపై బీజేపీ నేత సునీల్ ధియోధర్ సైతం స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. పవన్ ను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని ఆయన అన్నారు. సునీల్ దేవధర్ ఆరోపణలపై మంత్రి పేర్ని నాని తప్పుబట్టారు. సినిమాలతో ఆయనకేం సంబంధం అన్ని నిలదీశారు. బెనిఫిట్ షో పేరుతో సామాన్యులని దోచుకుంటుంటే.. పర్మీషన్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. సినిమా హిట్టా ఫట్టా అన్నసంగతి పక్కన పెడితే.. పొలిటికల్ గా మాత్రం బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Bjp, Bjp-janasena, Pawan kalyan, Tirupati, Tirupati Loksabha by-poll, Vakeel Saab, Vakeel Saab Movie Review

ఉత్తమ కథలు