ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ పుష్ప మూవీ పేరు అందులోని డైలాగ్‌లు గట్టిగా వినిపిస్తున్నాయి. పువ్వు గుర్తుగా చెప్పుకున్న కమలం పార్టీ నేతలు తమ నాయకుల్ని ఫ్లవర్ కాదు ఫైర్ అంటూ పుష్ప Pushpa సినిమాలోని డైలాగ్‌ని ఓన్ చేసుకుంటున్నారు. ఇది ఏ చోటా మోటా నాయకుడి నోట వెంట వస్తే లైట్‌గా తీసుకోవచ్చు కాని..సాక్షాత్తు కేంద్ర రక్షణశాఖ మంత్రి (Defense Minister),బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్‌సింగ్ (Rajnath Singh),నోట వచ్చిందంటే పుష్ప మూవీ ఏ రేంజ్‌కి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా సినిమాలో డైలాగ్లాగానే రాజ్‌నాథ్‌సింగ్ ఈ డైలాగ్‌ని కాంగ్రెస్‌కి వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఉపయోగించారు. ఉత్తరాఖండ్(Uttarakhand)లోని గంగోలిహాట్(Gangolihat)లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ తమ నాయకుడు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి (Uttarakhand Chief Minister)పుష్కర్‌సింగ్ ధామి( Minister Pushkar Singh Dhami)పేరును కాంగ్రెస్ (Congress)వాళ్లు పుష్పర్ అనే పేరు వింటేనే మా పుష్పరాన్ని పువ్వు అని అనుకుంటున్నారు. వాళ్లకు తెలియదు పుష్ప సినిమాలో మాదిరిగా మా పుష్కర్ ఫ్లవర్ మాత్రమే (Flower)కాదని ఫైర్ (Fire)అని కాంగ్రెస్ వాళ్లు తెలుసుకోవాలని సూచించారు. అంతటితో ఆగకుండా మా పుష్కరాలు ఎప్పటికి వంగవు, ఆగవు అంటూ బహిరంగసభలో చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా చప్పట్లు కొట్టారు. రాజ్‌నాథ్‌సింగ్ లాంటి సీనియర్‌నేత ఒక తెలుగు హీరో నటించిన సినిమాలో డైలాగ్‌ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మా నేత ఫ్లవర్ కాదు ఫైర్..
ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీలకు ధీటుగా బదులిచ్చిన రాజ్‌నాథ్‌సింగ్..కాంగ్రెస్ నేతలు అభ్యర్దులను నిలబెట్టడంలోనే అయోమయంలో ఉన్నారని..అలాంటిది గెలిస్తే ఎవర్ని ముఖ్యమంత్రిగా చేయాలో తెలియని పరస్తితి నెలకొందన్నారు. అంతే కాదు కాంగ్రెస్ ఇంటికే నిప్పు అంటుకోవడం కాదు ఇంట్లోనే మంట రగులుతోందని చురకలంటించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని సమర్ధవంతంగా పాలించగల సామర్ద్యం బీజేపీకే ఉందన్నారు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.
రాజ్‌నాథ్ సింగ్ పంచ్..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ..అంతే దూసుకుపోవాలని చూస్తోంది. సినిమా డైలాగ్‌లు వాడుకున్న, లేక స్టార్ క్యాంపెయిన్ చేసినా లేక చేస్తున్న సంక్షేమ పథకాల పేరుతో అయినా కమలం జెండా రెపరెపలాడాలని ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీనే అధికారంలోకి రావాలన్న తపన ఆ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.