ఉత్తర ప్రదేశ్ (Uttar pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్ (Yogi adityanath) కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య, మధుర లోని దేవాలయాల చుట్టు ఉన్న మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేదించారు. అదే విధంగా అక్కడ ఉన్న బెల్ట్ షాపుల లైసెన్స్ లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక మధురలోని 37 మద్యం దుకాణాలను అధికారులు మూసివేయనున్నారు. అయోధ్యలోని రామమందిరం, మథురలోని కృష్ణ జన్మభూమికి సమీపంలోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై నిషేధం (No liquor) విధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అయోధ్యలో మద్యం దుకాణాల యజమానుల లైసెన్స్‌లను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
2021లో ఇదే విధమైన ఆర్డర్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మధుర-బృందావన్‌లోని 10 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తీర్థయాత్రగా ప్రకటించింది. ఈ ప్రాంతంలో మద్యం మరియు మాంసం అమ్మకాలు అనుమతించబడవు. గతంలో యోగి కృష్ణోత్సవ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కాగా, వారణాసి, బృందావనం, అయోధ్య, చిత్రకూట్, దేవబంద్, దేవా షరీఫ్, మిస్రిఖ్-నైమిశారణ్య వంటి అన్ని ప్రార్థనా స్థలాలలో మద్యం దుకాణాలపై నిషేధం, మాంసాహార విక్రయాలను నిషేధిస్తున్నట్లు గతంలో ఆయన ప్రకటించారు. ఈ ఆర్డర్ జూన్ 1, 2022, బుధవారం నుండి వెంటనే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీని , యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రశంసించారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) 2014లో "ఆశ, మార్పు" అనే వాగ్దానంతో ప్రధానమంత్రిగా(Prime Minister) ఎన్నికయ్యారని, గత ఎనిమిదేళ్లలో ఆయన అలాంటి పాలనే అందించారని చెప్పారు ఉత్తరప్రదేశ్(Uttara Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). మోదీ(Modi) ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు అయిన సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం గురించి, మోదీ నాయకత్వం గురించి న్యూస్ 18కు(News18) ఆయన ప్రత్యేక వ్యాసం రాశారు. ఆ విషయాలు యోగి మాటల్లోనే.. మోదీ తన ఆలోచనలు, చర్యలు, దృక్పథంతో 'న్యూ ఇండియా'ను ఊహించారు. ఆయన ఆలోచనలు మన దేశాన్ని అభివృద్ధి, ప్రగతి పథంలో విజయవంతంగా నడిపించాయి. మోదీ బలీయమైన చర్యల ఫలితంగా భారతదేశం ప్రపంచ రాజకీయాల్లో శక్తివంతమైన స్థానం పొందింది. మన దేశం ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ దృక్పథాన్ని గ్రహించింది. ఆయన వ్యక్తిత్వం, సృజనాత్మకతలో కూడా అదే సంగ్రహావలోకనం స్పష్టంగా కనిపిస్తుంది.
దీని కారణంగా అసాధారణ సమయాల్లో అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో భారతదేశం విజయం సాధించింది. 135 కోట్ల మంది దేశప్రజల భావాలు, ఆకాంక్షలు నవ భారత నిర్మాణంలో ప్రతిబింబించేలా సంకల్ప శక్తితో ముందుకు సాగాలని మోదీ ప్రతి భారతీయుడిని ప్రేరేపించి, మార్గనిర్దేశం చేస్తున్నారు. గుజరాత్‌లోని వాద్‌నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన మోదీ ప్రయాణం, పుట్టినప్పటి నుంచి కౌమారదశకు, ప్రధానమంత్రిగా, అంతకు మించి ప్రభుత్వ సేవకుడిగా, సవాళ్లను అవకాశాలుగా మార్చగల ఆయన సామర్థ్యం వంటివి 135 కోట్ల మంది భారతీయుల సంకల్పానికి ఆధారంగా నిలుస్తోంది. గురుకులంలో విద్యాభ్యాసం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాఠశాలలో శిక్షణ పొందిన మోదీ.. అటల్ జీ స్ఫూర్తితో ప్రేరణ పొందారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Liquor ban, Uttar pradesh, Yogi adityanath