ముస్లింలు బహు భార్యా బంధాన్ని సమర్ధించుకునే విధంగా వ్యాఖ్యలు చేసి కొత్త వివాదానికి తెర తీశారు ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)ఎంఐఎం(MIM) పార్టీ నాయకుడు. ఆయన ముస్లింలు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికి వాళ్లను బాగానే చూసుకుంటారని...హిందువులు మాత్రం ఒకరి పెళ్లి చేసుకొని వాళ్లిని సరిగా చూసుకోకుండా ఇద్దరు, ముగ్గురితో సహజీవనం చేస్తూ ఎవర్ని గౌరవించరంటూ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ కీలక వ్యాఖ్యలు(Hijabహిజాబ్) అంశంపై సుప్రీం కోర్టు(Supreme Court)ద్విసభ్య ధర్మాసనం వేర్వేరు తీర్పులు ఇవ్వడంపై ఎంఐఎం నేత షౌకత్ అలీ(Shaukat ali) ఈవిధమైన కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి తెర తీశారు.
హిందువుల్ని కించపరిచే మాటలు..
మతం పేరుతో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంఐఎం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. అయితే ఇది అనేక సందర్భాల్లో వేర్వేరుగా వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. కాని ఉత్తరప్రదేశ్ ఎంఐఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్ అలీ హిందూ, ముస్లిం సామాజికవర్గాల మధ్య వైవాహిక సంబంధాలపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముస్లింలు మూడు పెళ్లిళ్లు చేసుకుంటామని కొందరు మాట్లాడుతున్నారు.. తాము రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికి ఇద్దరు భార్యలకు సమాజంలో సమైన గౌరవం, సముచిత స్థానం కల్పిస్తామని సమర్ధించుకున్నారు. అంతే కాదు ఇద్దరు భార్యలకు కలిగిన సంతానం పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయిస్తామని షౌకత్ అలీ వ్యాఖ్యానించారు.
మజ్లీస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
ముస్లింల బహు భార్య బంధాన్ని సమర్ధించుకున్న ఎంఐఎం నాయకుడు అంతటితో ఆగకుండా హిందువులు ఒకరి పెళ్లి చేసుకుంటారు..కాని ముగ్గురితో సహజీవనం చేస్తారంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు హిందువులు వివాహం చేసుకున్న భార్యను, వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాళ్లను గౌరవించరని అవమానిస్తూ మాట్లాడటంపై హిందువులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. భార్యను కానీ, ఇటు ప్రియురాళ్లను కానీ గౌరవించరని చెప్పారు షౌకత్ అలీ.
బీజేపీ నేతలు ఆగ్రహం ..
హిజాబ్ విషయంలో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులు ఇవ్వడంపై షౌకత్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఎవరు ఏది ధరించాలో నిర్ణయించాల్సింది హిందుత్వం కాదని రాజ్యాంగమని చెప్పుకొచ్చారు. కేవలం ఇలాంటి అంశాలను అడ్డుపెట్టుకొని బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందని.. వీటిని ఇలాంటి అంశాలను లేవనెత్తి దేశాన్ని విభజించాలని చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు షౌకత్ అలీ. యూపీ మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై హిందువులే కాదు బీజేపీ నేతలు సైతం తీవ్రంగా తప్పుపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIMIM, Uttar pradesh, VIRAL NEWS