హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

UP Elections: యూపీలో వేడెక్కిన రాజకీయాలు.. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపై ఎంఐఎం క్లారిటీ

UP Elections: యూపీలో వేడెక్కిన రాజకీయాలు.. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తుపై ఎంఐఎం క్లారిటీ

అసదుద్దీన్ ఓవైసీ, అఖిలేష్ యాదవ్

అసదుద్దీన్ ఓవైసీ, అఖిలేష్ యాదవ్

ఎవరైనా ముస్లిం ఎమ్మెల్యేను ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం చేయడానికి అఖిలేష్ యాదవ్ అంగీకరిస్తే.. ఎస్పీతో పొత్తుకి సిద్ధమేనని శనివారం అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఉత్తరప్రదేశ్ ఎంఐఎం చీఫ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పుటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతేకాదు పొత్తుల గురించి రకరకాలు చర్చలు తెరమీదకు వస్తున్నాయి. యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోనుందని ప్రచారం జరుగుతోంది. తమ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పొత్తుకు ఓకే అని ఓవైసీ చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎంఐఎం ఉత్తరప్రదేశ్ అధినేత షౌకత్ అలీ స్పందించారు. ఎస్పీతో ఎంఐఎం పొత్తు అంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను కానీ, తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎప్పుడు అలా అనలేదని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ గతంలో 20 శాతం ముస్లిం ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ఏ ముస్లిం నేతను డిప్యూటీ సీఎం చేయలేదని మాత్రమే అన్నామని చెప్పారు. అంతేతప్ప పొత్తుల గురించి చెప్పలేదని స్పష్టం చేశారు.

ఎవరైనా ముస్లిం ఎమ్మెల్యేను ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం చేయడానికి అఖిలేష్ యాదవ్ అంగీకరిస్తే.. ఎస్పీతో పొత్తుకి సిద్ధమేనని శనివారం అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఉత్తరప్రదేశ్ ఎంఐఎం చీఫ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఐతే వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎంఐఎం తమ వ్యూహాలకు పదును పెడుతతోంది. అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే భాగీదారి సంకల్ప్ మోర్చా(BSM)అనే కూటమి ద్వారా 9 స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు 30 నుంచి 39 శాతం వరకు ఉన్నారు. మరో 44 చోట్ల 40 నుంచి 49 శాతం మంది, 11స్థానాల్లో 50 నుంచి 65 శాతం మంది ఓటర్లు ఉన్నారు. బీఎస్ఎం కూటమి తరపున 100 సీట్లలో పోటీకి దిగనుంది ఎంఐఎం.

2017 ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ఎవరూ ఊహించనన్ని సీట్లు సాధించింది. బీజేపీ ఏకంగా 312 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ పార్టీ 19 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 7 సీట్లకే పరిమితమయింది. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అప్నాదళ్ 9 స్థానాల్లో విజయం సాధించింది. ఆర్ఎల్డీ ఒకే ఒక్క సీటు సాధించింది. ఈసారి కూడా అవే ఫలితాలు వస్తాయని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీఎస్పీ, ఎస్పీ కలిసి పోటీచేసినా తమకేం నష్టం లేదని.. ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.

First published:

Tags: Akhilesh Yadav, Asaduddin Owaisi, Uttar pradesh

ఉత్తమ కథలు