Home /News /national /

POLITICS UP ELECTIONS 2021 BJP WILL CROSS 350 SEATS NO DOUBT AND NO CHALLENGE SAYS YOGI ADITYANATH IN NEWS18 INTERVIEW GH SK

Exclusive: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి 350 సీట్లు ఖాయం.. న్యూస్18 ఇంటర్వ్యూలో యోగి ఆదిత్యనాథ్ ధీమా

యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath Exclusive Interview: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మళ్లీ తమదే అంటున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూస్ 18.కామ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యోగి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు..

ఇంకా చదవండి ...
దేశ రాజకీయాలపై ప్రభావం చూపగల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (UP assembly Elections 2021)కు ఆ రాష్ట్ర రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీజేపీతో పాటు సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party), కాంగ్రెస్ ఇప్పటికే ఎన్నికల కోసం వ్యూహాలు రచించాయి. అయితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మళ్లీ తమదే అంటున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath). రాష్ట్రంలో బీజేపీ (BJP) 350 సీట్లకు పైగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. న్యూస్ 18.కామ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యోగి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు..

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ (Akhiesh Yadav)పై యోగి ఆదిత్యనాథ్ వ్యంగాస్త్రాలు వేశారు. ప్రతిపక్షాలు మొహమ్మద్ అలీ జిన్నా పేరు వాడుతూ ఒక వర్గం మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ప్రియాంక గాంధీ చేపట్టిన ఎలక్షన్ టూరిజంతో కాంగ్రెస్‌కు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఇదే సమయంలో లఖింపూర్ ఖేరీ కేసులో ఎవరికీ రక్షణ కల్పించడం లేదని సీఎం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో యోగిని అడిగిన ప్రశ్నలు, వాటికి ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవే..

Telangana: కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఆ చర్చ జరిగిందా ?

ప్రశ్న: రానున్న యూపీ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద సవాల్ ఏంటి? మీ పార్టీ మళ్లీ 300 సీట్లు దాటుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో చాలాసార్లు ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కానీ ఈ ఎన్నికలపై మీ విశ్వాసానికి కారణం ఏంటి?

సమాధానం: 2017 మేనిఫెస్టోలో (లోక్‌కల్యాణ్ సంకల్ప్ పత్ర) పేర్కొన్న ప్రతి హామీని మా ప్రభుత్వం నెరవేర్చింది. కాబట్టి ఈసారి కూడా బీజేపీ 350 సీట్లు (మొత్తం 403 సీట్లలో) దాటుతుంది. ఇందులో మాకు ఎలాంటి సందేహం లేదు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్‌ను ఒక అనారోగ్యకరమైన రాష్ట్రంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. గత నాలుగున్నరేళ్లుగా మా ప్రభుత్వం రాష్ట్రంలోని 24 కోట్ల మంది పౌరుల అభ్యున్నతికి కృషి చేసింది. రాష్ట్రం కోసం, ప్రజల కోసం మనం చేసిన కృషి మాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, పేదల సంక్షేమానికి భరోసా ఇచ్చాం. 2017లోనే రుణమాఫీ పథకం ద్వారా రూ. 36,000 కోట్ల విలువైన వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. దీనివల్ల దాదాపు 2.1 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. భారతదేశాన్ని గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్‌గా మార్చడంలో యూపీ మరింత కీలక పాత్ర పోషిస్తుంది.

* మీ దృష్టిలో మీకు అతిపెద్ద ఛాలెంజర్ ఎవరు? సమాజ్ వాదీ పార్టీనా, బహుజన్ సమాజ్ పార్టీనా, కాంగ్రెసా? తామే అధికార పక్షానికి ప్రధాన సవాల్ అని ఎస్పీ చెబుతోంది? దీనిపై ఏమంటారు?

మేము ఎవరినీ సవాలుగా చూడట్లేదు.

BJP ఎఫెక్ట్.. నేతలకు పదవులు ఇచ్చే యోచనలో KCR.. వాళ్లకే మొదటి  ప్రాధాన్యత

* ఈ ఎన్నికల్లో మీకు లబ్ధి చేకూర్చే అంశం ఏంటి? అభివృద్ధి, శాంతిభద్రతలు లేదా పెట్టుబడుల్లో మీ పోల్ ప్లాంక్ ఏది? మీ హయాంలో ఈ అంశాల్లో UP ఇమేజ్ మెరుగుపడిందని భావిస్తున్నారా?

2017 నుంచి మేము సంస్కరణలు, పనితీరు, పరివర్తనపై దృష్టి సారించాం. ఈ పాలసీ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న స్థిరమైన శాంతిభద్రతల కారణంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందాం. గతంలో పారిశ్రామికవేత్తలను వేధించిన క్రైమ్ సిండికేట్‌లకు చెక్ పెట్టేందుకు కఠినమైన చట్టం తీసుకువచ్చాం. ఇది రాష్ట్రంలో వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. శామ్‌సంగ్, రిలయన్స్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు రాష్ట్రంలో పరిశ్రమలను స్థాపించడానికి ఇదే కారణం. వివిధ రంగాల్లో రాష్ట్రం దాదాపు రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. వీటిలో దాదాపు రూ. 5 లక్షల కోట్లు భారీ పరిశ్రమలు, మరో రూ. 5 లక్షల కోట్లు MSME రంగంలో ఉన్నాయి. వీటి ద్వారా 30 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.

* మీరు బుల్డోజర్ పదం వాడటాన్ని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. మీపై అనేక వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. దీనిపై మీ స్పందన?

మేము అవినీతిపరులు, నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లపై బుల్‌డోజర్‌లను ఉపయోగించాం. అఖిలేష్ యాదవ్‌కు బుల్‌డోజర్‌తో సమస్య ఉందంటే, సంవత్సరాలుగా పేదలను వేధిస్తున్న నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లపై ఆయన ఎలా సానుభూతి చూపుతున్నారో గుర్తించవచ్చు. గత ప్రభుత్వం కుర్చీని కాపాడుకోవడానికి ఎప్పుడూ మాఫియాలకు మద్దతు ఇచ్చేది. ఫలితంగా పేదలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వేధింపులకు గురయ్యారు. దీంతో పెట్టుబడులు రాలేదు. తలసరి ఆదాయం, వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి చేరాయి. నిరుద్యోగిత రేటు గరిష్టానికి చేరింది. మేము ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. మాఫియాలపై కఠినమైన చర్యలు తీసుకున్నాం. 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరించడంతో ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సమాజ్‌వాదీ పార్టీ మాఫియాలను రక్షించడానికి ప్రయత్నిస్తూ, వారి మద్దతు కోసం చూస్తోంది. కానీ మెజారిటీ ప్రజల ఆలోచన ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంది.

KCR వ్యూహాలకు కౌంటర్ రెడీ.. రంగంలోకి దిగిన Amit Shah.. ఆ ఏడుగురు నేతలకు పిలుపు

* మీ ప్రభుత్వం సొంతంగా ఏ కొత్త ప్రాజెక్టును ప్రారంభించలేకపోయిందని, గత ప్రభుత్వ ప్రాజెక్టులను మాత్రమే ముందుకు తీసుకెళ్తోందని యాదవ్ చెబుతున్నారు. ఇందుకు పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని ఉదాహరణగా చెబుతున్నారు?

ఎన్నికలకు రెండు నెలల ముందు ఒక ప్రాజెక్ట్‌కు టోకెన్ మొత్తాన్ని మంజూరు చేయడం, టెండర్‌ను ఆమోదించకపోవడం, ప్రాజెక్ట్‌ను సగంలో వదిలివేయడం వారికి అలవాటైంది. ఇది ఒక ఎన్నికల స్టంట్. కానీ మేము ఇందుకు విరుద్ధం. మేము ప్రాజెక్టులను పునఃపరిశీలించాం. కొత్త టెండర్ సిస్టమ్ ద్వారా ఖర్చును తగ్గించాం. గడువులోగా పనులు పూర్తి చేశాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము చేస్తున్న కృషిని ఇది తెలియజేస్తుంది. అంతకుముందు పేలవమైన మౌలిక సదుపాయాలకు పేరుగాంచిన ఉత్తరప్రదేశ్, ఇప్పుడు భారతదేశపు అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దాదాపు 1,321 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల విషయంలో మా విజయాన్ని సూచిస్తోంది.

* ముఖ్తార్ అన్సారీ వంటి మాఫియా పేర్లు, ఆజం ఖాన్ వంటి నాయకులపై మీ ప్రభుత్వం తీసుకున్న చర్య చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ చర్యల వెనుక ఉన్న ఆలోచన ఏంటి?

చట్టాన్ని అమలుచేయాలన్నదే మా ఆలోచన. మేము మాఫియాలను రక్షించం. వారిపై చర్యలు తీసుకుంటాం. కబ్జాకు గురైన మాఫియా భూముల్లో మా ప్రభుత్వం పేదలకు, దళితులకు ఇళ్లు నిర్మిస్తుంది. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ అనే కొత్త ఉత్తరప్రదేశ్‌లో మాఫియాలు, నేరస్థులు, ఇతర సంఘవిద్రోహ శక్తులకు స్థానం లేదు. గ్రామాలు, రైతులు, యువత, అభివృద్ధే ధ్యేయంగా పనిచేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారిన మాఫియా సంస్కృతిని అంతమొందించడం కూడా ముఖ్యం. ఇప్పటివరకు ముక్తార్ అన్సారీ, అతీక్ అహ్మద్, విజయ్ మిశ్రా, సుందర్ భాటి వంటి వారితో కలిపి మొత్తం 40 మందికి పైగా మాఫియా గ్యాంగ్‌ల నుంచి సుమారు రూ. 1,800 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నాం.

* లఖింపూర్ ఖేరీ వంటి ఘటనలపై మీ ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడిన ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆమె మీకు సవాల్‌గా ఎదుగుతోందా? యూపీలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు ‘మ్యాచ్ ఫిక్స్‌డ్’ అని ఎస్పీ చెబుతోంది?

నాలుగున్నర ఏళ్ల క్రితం కాంగ్రెస్‌తో ఎవరు పొత్తు పెట్టుకున్నారో అందరికీ తెలిసిందే. కోవిడ్ -19 సమయంలో ప్రియాంక గాంధీ యూపీలో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఎలక్షన్ టూరిజంతో ప్రయోజనం ఏంటి? జిన్నా, పోలరైజేషన్ సమస్యలను లేవనెత్తుతున్నది ప్రతిపక్షం. మేము కాదు కదా!

యూపీలో మొదలైన ఎన్నికల వేడి..  ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సమాజ్​వాదీ పార్టీ

* లఖింపూర్‌ ఘటన తరువాత.. ఓ కేంద్ర మంత్రి కుమారుడికి రక్షణ కల్పించాలని యూపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి కదా?

మేము ఎవరినీ రక్షించడానికి ప్రయత్నించడం లేదు. ఇది దురదృష్టకర సంఘటన అయినప్పటికీ, 24 గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చాం. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశాం. పరిస్థితిని పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు.. ఒక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించింది. నిందితులను విచారణకు తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందించాం.

* మీ మాజీ భాగస్వామి ఓం ప్రకాష్ రాజ్‌భర్ SPతో చేతులు కలిపారు. గత మూడు ఎన్నికలలో పూర్వాంచల్ బీజేపీకి కంచుకోటగా ఉంది. ఓం ప్రకాష్ ప్రభావంతో ఇక్కడ ఏదైనా ఎదురుదెబ్బ తగులుతుందనే ఆందోళన ఉందా?

అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం మాకు ఎల్లప్పుడూ బలమైన కంచుకోట. బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని, జిన్నా దేశానికి ప్రధాని కావడానికి అర్హుడని విశ్వసించే వ్యక్తిని యూపీ పౌరులు ఎప్పటికీ విశ్వసించరు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పూర్వాంచల్‌ అభివృద్ధికి మా ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇక్కడ వేలాది మంది పిల్లల మరణానికి కారణమైన జపనీస్ ఎన్సెఫాలిటిస్‌ను నియంత్రించగలిగాం. గోరఖ్‌పూర్‌లో AIIMS ఏర్పాటు చేశాం. ఇది మొత్తం పూర్వాంచల్ ప్రాంతానికి ప్రయోజనం చేకూర్చింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ఆర్థిక వ్యవస్థకు, ఈ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వలసలకు ముగింపు పలుకుతూ మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుంది.

* కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో UP అగ్రస్థానంలో ఉంది. అయితే అర్హత ఉన్న వ్యక్తులందరికీ పూర్తిగా టీకాలు వేయడానికి చాలా దూరం వెళ్లాలి. రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందించిన తరువాతే తాను టీకా తీసుకుంటానని అఖిలేష్ చెప్పారు. మహమ్మారిని అరికట్టడంలో మీరు విఫలమయ్యారని ఎస్పీ ఆరోపిస్తోంది. దీనిపై ఏమంటారు?

కోవిడ్ వ్యాప్తి సమయంలో ఎస్పీ నాయకులు ఎవరూ సందర్శించలేదు. అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకోకుండా, మన శాస్త్రవేత్తలను, వైద్యులను అగౌరవపరుస్తున్నారు. అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. మా ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా ఉత్తరప్రదేశ్ కోవిడ్-19 నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. టెస్టింగ్, టీకాల పరంగా ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉంది. డిసెంబర్ మూడవ వారంలోపు అర్హులైన లబ్ధిదారులకు 100% కోవిడ్-19 వ్యాక్సిన్‌ ఫస్ట్ డోస్‌ అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దీన్ని సాధించేందుకు ప్రతిరోజు 15 నుంచి 20 లక్షల డోసులను అందిస్తున్నాం. లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఆదివారం కూడా ప్రజలకు టీకాలు వేస్తున్నాం.

KCR: కేసీఆర్ మౌనం.. ఆ సీనియర్ నేత పొలిటికల్ కెరీర్ మళ్లీ డైలమాలో  పడిపోయినట్లేనా?

* ఎన్నికలకు సంబంధించి ‘నయా ఉత్తరప్రదేశ్’ నినాదం ఏంటి?

వ్యాపారాన్ని సులభతరం చేయడంలో రాష్ట్రం సాధించిన అద్భుతమైన పురోగతికి ఈ నినాదం స్పష్టమైన సూచన. గత 4.5 ఏళ్లలో రాష్ట్రం 12 స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరింది. మహమ్మారి సమయంలో కూడా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోనివ్వలేదు. 66,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను అందుకున్నాము. ఇది గుజరాత్, తమిళనాడు వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద రాష్ట్రంగా యూపీ అవతరించింది. 2017కి ముందు, నిరుద్యోగం 18% కంటే ఎక్కువగా ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రకారం, రాష్ట్రంలో (ప్రస్తుతం) నిరుద్యోగిత రేటు 4.8% వద్ద ఉంది. ఢిల్లీ, కేరళ, తమిళనాడులతో పోల్చినప్పుడు ఇది చాలా మెరుగ్గా ఉంది. ఎన్నో కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించాం. MSMEలకు చేయూత అందిస్తున్నాం. రాష్ట్రంలోని చేనేత, హస్తకళల రంగంలో ఎగుమతి వృద్ధిని 38%కి పెంచాం.

* మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టులను మీరు ఎన్నికల ట్రంప్ కార్డ్‌గా భావిస్తున్నారా? ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లు ప్లాన్ చేస్తున్నారు?

మా హయంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభమైంది. మరో మూడు ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నాం. ఈ కనెక్టివిటీ సదుపాయాలు సామాజిక-ఆర్థిక అభివృద్ధిని పెంచుతాయి. ఇటీవల ప్రారంభించిన పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేతో గతంలో నిర్లక్ష్యానికి గురైన పూర్వాంచల్‌ ప్రాంతాన్ని మళ్లీ అభివృద్ధి పటంలో నిలిపాం. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద నాలుగు మెట్రోలు, తొమ్మిది విమానాశ్రయాలను సిద్ధం చేశాం. మరో 28 విమానాశ్రయాల పనులు పురోగతిలో ఉన్నాయి. భవోని డ్యామ్ ప్రాజెక్ట్‌తో సహా అనేక నీటిపారుదల ప్రాజెక్టులు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో నీటి కొరతను పరిష్కరించనున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సహాయపడతాయి. ఇవన్నీ రాష్ట్రంలో మా గెలుపునకు సహకరిస్తాయి.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Up news, Uttar pradesh, Uttar Pradesh Assembly Elections, Yogi adityanath

తదుపరి వార్తలు