యూపీ రాజకీయాల్లో సోమవారంనాడు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమాజ్‌వాది పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్‌ను ఆయన ఇంటికి వెళ్లారు. ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ చీఫ్ శివపాల్ యాదవ్ కూడా ములాయంతో పాటు ఇంట్లో ఉన్నారు. అనారోగ్యం కారణంగా ములాయం సింగ్ యాదవ్ ఆదివారంనాడు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. షుగర్ లెవల్స్ బాగా పెరగడంతో ఆస్పత్రిలో చేరిన ములాయం...చికిత్స తర్వాత డిశ్ఛార్జ్ అయ్యారు.
ములాయం ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆయన ఇంటికి రావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తు ఉండబోదని, ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించడం తెలిసిందే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ-సమాజ్‌వాది పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీ హవాను అడ్డుకోలేకపోయాయి.
ములాయం సింగ్ యాదవ్‌ను పరామర్శించేందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయన నివాసానికి వెళ్లినట్లు బీజేపీ నేతలు చెబుతున్నా...దీని వెనుక రాజకీయం ఉండొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. సమాజ్‌వాది పార్టీకి మాయావతి దూరం జరిగిన నేపథ్యంలో...ఆ పార్టీకి బీజేపీ దర్గరవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాల్సిందే.
UP CM Yogi Adityanath meets SP leader Mulayam Singh Yadav at his residence. MS Yadav was admitted to hospital yesterday due to high levels of blood sugar. SP Chief Akhilesh Yadav and Pragatisheel Samajwadi Party Chief Shivpal Yadav also present. pic.twitter.com/bOKWeqa6uq
— ANI UP (@ANINewsUP) June 10, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, Yogi adityanath