హోమ్ /వార్తలు /national /

Dubbaka ByElection Results: దుబ్బాకలో బీజేపీ గెలుపు తెలంగాణలో ధర్మస్థాపనకు నాంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలు..

Dubbaka ByElection Results: దుబ్బాకలో బీజేపీ గెలుపు తెలంగాణలో ధర్మస్థాపనకు నాంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలు..

కిషన్ రెడ్డి(ఫైల్)

కిషన్ రెడ్డి(ఫైల్)

దుబ్బాకలో బీజేపీ విజయం తెలంగాణలో ధర్మ స్థాపనకు, సుపరిపాలనకు నాంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన దుబ్బాక ప్రజలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయ కేతనం ఎగురవేయడం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతుందన్నారు. దుబ్బాకలో గెలుపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఏ ఎన్నికలు అయినా.. అభ్యర్థి ప్రాధాన్యతగానే జరుగుతాయన్నారు. అయితే అభ్యర్థి గెలుపును, పార్టీ గెలుపును విడదీయలేమన్నారు.

  టీఆర్ఎస్ తప్పులను బహిర్గతం చేయడానికి, అన్యాయాలపై పోరాడటానికి మేము ఇక్కడ ఉన్నామని ఎమ్మెల్యేగా గెలుపొందిన రఘునందన్ రావు, బీజేపీ కార్యకర్తలు  నిరూపించారని కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాకలో బీజేపీ విజయం తెలంగాణలో ధర్మ స్థాపనకు, సుపరిపాలనకు నాంది అని అభివర్ణించారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన దుబ్బాక ప్రజలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విజయం కోసం కష్టపడిన కార్యకర్తలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Kishan Reddy, Telangana bjp

  ఉత్తమ కథలు