హోమ్ /వార్తలు /national /

Budget 2019: కేంద్ర బడ్జెట్‌లో ‘రైతుబంధు’, కేటీఆర్ పంచ్

Budget 2019: కేంద్ర బడ్జెట్‌లో ‘రైతుబంధు’, కేటీఆర్ పంచ్

కేటీఆర్

కేటీఆర్

Live Union Budget 2019 Updates | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతు బంధు పథకానికి ఎన్డీయే ప్రభుత్వం పేరు మార్చి బడ్జెట్‌లో పెట్టిందని ఎద్దేవా చేశారు.

2019- 20 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.27లక్షల కోట్ల బడ్జెట్‌లో రైతుల కోసం భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున సాయం చేయనుంది. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. దీని వల్ల 12కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పీయూష్ గోయల్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్కీమ్‌ కోసం బడ్జెట్‌లో రూ.75వేల కోట్లు కేటాయించారు.

ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ పథకం సేమ్ టు సేమ్ తెలంగాణలో అమలు చేస్తున్న ‘రైతు బంధు’ తరహాలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూ.8కోట్లు ఇస్తోంది. దీన్ని వచ్చే ఏడాది నుంచి రూ.10వేలకు పెంచనున్నారు. కేసీఆర్ మానసపుత్రిక అయిన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకానికే ఎన్డీయే ప్రభుత్వం పేరు మార్చి కొత్తగా ప్రవేశపెట్టిందన్నారు.

మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా కేంద్రం పథకంపై స్పందించారు. కేసీఆర్ పథకాన్ని కాపీ పేస్ట్ చేశారంటూ విమర్శించారు. దేశానికి కేసీఆర్ లాంటి లీడర్లు కావాలని ప్రకటించారు.

తెలంగాణలో రైతుల కోసం రైతుబంధుతో పాటు రైతు బీమా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోంది.

First published:

Tags: Asaduddin Owaisi, KTR, Piyush Goyal, Pm modi, Union Budget 2019

ఉత్తమ కథలు