హోమ్ /వార్తలు /national /

జగన్ పాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తి

జగన్ పాలనపై ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తి

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌న్న ఉండవల్లి... ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని అన్నారు.

పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదని అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపై తీర్చుకోవడానికి కాదని ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడటం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు... అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోందన్న ఉండవల్లి... అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని విమర్శించారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం కూడా పాటించడంలేదన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు. మాస్కు వేసుకోకపోతే ఫైన్ వేస్తున్న అధికారులు వాళ్లు ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేద‌న్న ఆయన.. ఏపీలో నిర్మాణ రంగం కుదేలైపోయింద‌ని అన్నారు. 15 ఏళ్ల క్రితం కట్టించిన ఇళ్లే ఇంత వరకు పేదలకు ఇవ్వలేదని ఉండవల్లి ఆరోపించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Undavalli Arun Kumar

ఉత్తమ కథలు