Home /News /national /

POLITICS UDDHAV THACKERAY SAYS HAD AMIT SHAH KEPT HIS WORD THERE WOULD HAVE BEEN A BJP CM NOW PVN

Uddhav thackeray : అమిత్ షా మాట నిలబెట్టుకొని ఉంటే..ఇవాళ బీజేపీ వ్యక్తే సీఎంగా ఉండేవాడు కదా!

ఉద్ధవ్ థాక్రే

ఉద్ధవ్ థాక్రే

 Uddhav thackeray : మహారాష్ట్ర మాజీ సీఎం,శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకు మీడియా ముందుకు వచ్చిన ఉద్దవ్ ఠాక్రే..ఏక్‌నాథ్ షిండే, బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌నపై కోపంతో ముంబైకి ద్రోహం చేయ‌వ‌ద్ద‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే సీఎం ఏక్‌నాథ్ షిండేను కోరారు.

ఇంకా చదవండి ...
Uddhav thackeray : మహారాష్ట్ర మాజీ సీఎం,శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే(Uddhav Thackeray) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి(Maharashtra CM) పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకు మీడియా ముందుకు వచ్చిన ఉద్దవ్ ఠాక్రే..ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde), బీజేపీ(BJP)ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త‌నపై కోపంతో ముంబైకి ద్రోహం చేయ‌వ‌ద్ద‌ని మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే సీఎం ఏక్‌నాథ్ షిండేను కోరారు. మెట్రో రైల్ షెడ్ ప్రాజెక్టును ఆరే కాల‌నీకి త‌ర‌లిస్తూ సీఎంగా బాధ్యతలు స్పీకరించిన మొదటిరోజే నిర్వహించిన కేబినెట్ భేటీలో ఏక్ నాథ్ షిండే తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఉద్దవ్ ఠాక్రే ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఆరే కాల‌నీకి కార్ షెడ్ త‌ర‌లింపుతో ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం నెల‌కొంటుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌న‌ను వెన్నుపోటు పొడిచినా ముంబైని మాత్రం వెన్నుపోటు పొడ‌వ‌కండి అని హిత‌వు ప‌లికారు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్ మీటింగ్‌లో ఆరేపై మహా వికాస్ అఘాడీ(MVA) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తిరగరాశారు. మెట్రో లైన్-3 కార్ షెడ్‌ను యారె కాలనీ నుంచి కంజుర్‌ మార్గ్‌ కు ఉద్దవ్ సర్కార్ మార్చగా... దీనిని కంజుర్‌మార్గ్‌ నుంచి మళ్లీ ఆరె కాలనీకి మారుస్తూ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఉద్దవ్ ఠాక్రే. 2019లో త‌మ‌తో అధికారాన్ని పంచుకునేందుకు నిరాక‌రించిన కాషాయ పార్టీ ఏక్‌నాథ్ షిండేతో ఇప్పుడు చేతులు ఎలా క‌లిపింద‌ని ఠాక్రే ప్ర‌శ్నించారు. గత ఎన్నికల అనతరం ముఖ్యమంత్రి కుర్చీ పంపకానికి ఎందుకు ఒప్పుకోలేదని బీజేపీ ప్రశ్నించారు. ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ..."బీజేపీకి ఇప్పుడు దొరికిన ఆనందం ఏంటో అర్థం కావడం లేదు.ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి ఏం రాలేదు. మరి అలాంటప్పుడు కుర్చీ పంపకంపై అప్పుడు ఎందుకు వ్యతిరేకించనట్టు?. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amith Shah) ...2.5 సంవత్సరాలు సేన నాయకుడిని సీఎం చేయాలనే అసలు ఒప్పందానికి కట్టుబడి ఉంటే మహా వికాస్ ప్రభుత్వం వచ్చేది కాదు, అంతేకాకుండా ఈ రోజు బీజేపీ నాయకుడు సీఎం అయి ఉండేవాడు. గత ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడే అధికారాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకుందాని నేను అమిత్ షాకు ముందే చెప్పాను. వారు ఇంతకు ముందే చేసి ఉంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు"అని చెప్పారు. బీజేపీ దీని వల్ల సాధించిందేమని విమర్శించారు. తనను బెదిరించినట్లు ప్రజల్ని బెదిరించవద్దని ఉద్దవ్ విజ్ణప్తి చేశారు. ముంబైని వెనుకబాటు గురి చేయకుండా పాలించాలని ఉద్ధవ్ సూచించారు. ప్ర‌జ‌ల క‌న్నీళ్లే త‌న బ‌ల‌మ‌ని ఉద్దవ్ చెప్పారు. బీజేపీతో వెళ్లిన సేన ఎమ్మెల్యేలు త‌మ‌ను తాము ప్ర‌శ్నించుకోవాల‌ని అన్నారు.

IT Notice To Sharad pawar : టార్గెట్ పవార్..షిండే సీఎం అయిన 24 గంటల్లోనే పవార్ కు నోటీసులు!

మరోవైపు,నాటకీయ ప‌రిణామాల మ‌ధ్య గురువారం శివసేన(Shiv Sena) రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మ‌హారాష్ట్ర సీఎంగా(Maharashtra CM) ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం(జులై-4) అసెంబ్లీలో త‌న మెజారిటీని నిరూపించుకోవడానికి షిండే రెడీ అవుతున్నారు. జులై 2 నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. జులై 4 సోమవారం రోజు షిండే బలనిరూపణ చేసుకోకున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం లేనప్పటికీ..బలనిరూపణకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయాలని షిండే సమావేశంలో అధికారులకు సూచించారని తెలుస్తోంది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Amit Shah, Bjp, Eknath Shinde, Shiv Sena, Uddhav Thackeray

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు