హోమ్ /వార్తలు /national /

Andhra pradesh: షాకింగ్: రెండుసార్లు ఎమ్మెల్యే: ప్రస్తుతం సన్యాసిగా మారారు? ఎవరాయన? ఎందుకో తెలుసా?

Andhra pradesh: షాకింగ్: రెండుసార్లు ఎమ్మెల్యే: ప్రస్తుతం సన్యాసిగా మారారు? ఎవరాయన? ఎందుకో తెలుసా?

సన్యాసిగా మారిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే

సన్యాసిగా మారిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే

ఒకటి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. అయినా సాధారణ జీవితమే గడిపారు. ప్రస్తుత రాజకీయాలను వంటపట్టించుకోలేక ఆయన వరుస పరాజయాలతో ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏం కష్టమొచ్చిందో ఏమో సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చారు.

ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలన్నది ఎంతో మంది కల.. ఒక్కసారి ఆ ముద్ర వేసుకుంటే చాలు జీవితాంత ఆ పదవి పేరు చేపుకుని మంచి హోదాలో తిరిగేయవచ్చు.. నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చు. అందుకే ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు ఎందాకైనా అంటారు. కోట్లు కూడా ఖర్చు చేస్తున్న రోజులు ఇవి. ఒకసారి ఎమ్మెల్యే అని ముద్ర వేసుకుంటే తరువాత వారసులను, వారి వారసులను అదే రాజకీయాల్లో కొనసాగించవచ్చన్నది చాలామంది ఆశ. మాజీ ఎమ్మెల్యేగా వచ్చే ప్రయోజానాలు, హోదాలు, పైపొచ్చు రాజకీయ పరిచయాలతో పైరవీలు ఇలా కాలం సాఫీగా సాగదీయొచ్చు. ప్రస్తుతం చాలామంది ఆలోచన ఇదే. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు చాలాసార్లు గెలిచినా ఇంకా పింఛన్ కోసమే ఎదురుచూసేవారు కూడా ఉన్నారంటే నమ్ముతారా? కానీ అది నిజమే..

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక వెలుగు వెలిగిన నేత.. ఇప్పుడు ఏకం సన్యాసిగా మారడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ రాజకీయ జీవతం చాలు అనుకున్నారో? ఆ ముద్ర తనమీద ఉండడం నచ్చలేదో? లేక జీవితం మీద విరక్తి చెందిందో..  ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు వెగటు పుట్టించాయో కారణం ఏదైనా.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఓ వ్యక్తి ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శివరామకృష్ణారావు ప్రస్తుతం సన్యాసిగా మారారు. మొదట 1978లో జనతాపార్టీ నుంచి, తరువాత 1989లో కాంగ్రెస్​ నుంచి గెలిచారు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి 44 వేల మెజార్టీతో, రెండోసారి 60 వేల మెజార్టీతో గెలిచారు. మంచి వ్యక్తిగా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆ రెండు సార్లు విజయం సాధించినా.. తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీని తట్టుకోలేకపోయారు. వరుసగా కాంగ్రెస్ తరుపున 1972లో, 1983లో, 1985లో, 1994లో, 1999లోపోటీ చేసి ఓడిపోయారు. చివరిసారిగా 2001 ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గంలో కాంగ్రెస్​ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి విజయమ్మ చేతిలో 58 వేల ఓట్లతో ఓడిపోయారు. అంతే అక్కడ నుంచి ఇక ఈ ఓటముల భారం తట్టుకోలేను అనుకున్నారు ఏమో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

వృత్తిరీత్యా వైద్యుడు అయిన శివరామకృష్ణారావు సడెన్ గా ఇలా సన్యాసి రూపంలో దర్శనమివ్వడంతో బద్వేల్ నియోజకవర్గ ప్రజలంతా షాక్ గురి అవుతున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఆయన్ను ఎమ్మెల్యేగా చూసినవారంతా.. అయ్యో పాపం ఎందుకిలా అయ్యారు అని నిట్టూరుస్తున్నారు. ఆయన ఎలాంటి కారణాలు చెప్పకుండానే సన్యాసం స్వీకరించారు. సన్యాసిగా కనిపిస్తున్న ఆయన ఫొటో ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Andhra Pradesh, AP Congress, AP News, AP Politics

ఉత్తమ కథలు