అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. హాయ్ ల్యాండ్ తమది కాదని ఆ సంస్థ యాజమాన్యం హైకోర్టుకు తెలిపింది. కోర్టులో అగ్రిగోల్డ్ కేసు విషయమై శుక్రవారం విచారణ జరిగింది. ఈసందర్భంగా కోర్టుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం ట్విస్ట్ ఇచ్చింది. హాయ్ లాండ్ తమది కాదని అగ్రిగోల్డ్ ప్రతినిధి ఆలూరి వెంకటేశ్వర్రావు కోర్టుకు తెలిపారు.
దీంతో ఈ విషయంపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది న్యాయస్థానం. అగ్రిగోల్డ్ కేసులో సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదని హైకోర్టు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లాల వారీగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇంత కాలం పాటు ఈ విషయాన్ని చెప్పనందుకుగాను అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. సిట్ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agri Gold, Andhra Pradesh, AP Politics, High Court