హోమ్ /వార్తలు /national /

Telangana ముందస్తు ఎన్నికలు! CM KCR హ్యాట్రిక్ కొట్టినట్టే.. ఉద్యోగాల ప్రకటన తర్వాత Owaisi వ్యాఖ్యలు

Telangana ముందస్తు ఎన్నికలు! CM KCR హ్యాట్రిక్ కొట్టినట్టే.. ఉద్యోగాల ప్రకటన తర్వాత Owaisi వ్యాఖ్యలు

కేసీఆర్ తో ఒవైసీ సోదరులు(పాత ఫొటో)

కేసీఆర్ తో ఒవైసీ సోదరులు(పాత ఫొటో)

ముందస్తు ఎన్నికలు ఖాయమనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది అధికార టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ. కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయమని, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఒవైసీ అన్నారు..

తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు ఖాయమనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది అధికార టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీ. ముందస్తు ఎన్నికల్లో లబ్ది కోసమే కేసీఆర్ మెగా కొలువుల జాతర ప్రకటించారని, ముదస్తు వ్యూహంలో భాగంగానే గత రెండు నెలలుగా విస్తృతంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారనే విపక్షాలూ వాదిస్తున్నాయి. కాగా, కేసీఆర్ హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయమని, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఏఐఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు. అదే క్రమంలో కీలక అంశాలపై కేసీఆర్ సర్కారును తూర్పారాపట్టారు పతంగి పార్టీ నేత. వివరాలివి..

తెలంగాణలో మెగా కొలువుల జాతర ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం.. మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ పోను, కొత్తగా 80,039 ఉద్యోగాలకు దశలవారీగా నోటిఫికేషన్లు వేస్తామని వెల్లడించారు. కేసీఆర్ కొలువుల ప్రకటనపై టీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా సంబురాలు జరుపుకొంటుండగా, విపక్షాలు మాత్రం నిరుద్యోగ భృతి అంశాన్ని, 2 లక్షల ఖాళీలుంటే కొన్నిటినీ భర్తీ చేయడాన్ని తప్పుపడుతున్నాయి. ఇక టీఆర్ఎస్ కు ఏకైక మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ మాత్రం కొలువుల ప్రకటనను స్వాగతించింది. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలుస్తుందని మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

CM KCR: ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనా? -జాబ్ క్యాలెండర్‌లో మతలబు? -నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!


అసెంబ్లీ వేదిక ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తోనే ఉంటామని అన్నారు. రాబోయేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. బంగారు తెలంగాణ అభివృద్దిలో టీఆర్ఎస్ తో ఎంఐఎం కలిసి ముందుకు సాగుతుందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఒవైసీ వ్యాఖ్యానించారు. అంతవరకూ బాగానే ఉన్నా,

Telangana ఉద్యోగాల్లో మొత్తం ఖాళీలెన్ని? CM KCR ఇచ్చినవెన్ని? ప్రైవేటులో స్థానికత ఏది? : Kodandaram


ముందస్తు ఎన్నికల ఊహాగానాలను బలోపేతం చేస్తూ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అక్బరుద్దీన్ ఒవైసీ.. అదే సమయంలో టీఆర్ఎస్ సర్కారుపై పదునైన విమర్శలు కూడా గుప్పించారు. అభినందనలు మాత్రమే కాదు విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. గత మూడేళ్లుగా మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదని ఒవైసీ ఆరోపించారు. రాష్ట్రంలో మెడకల్ వ్యవస్థ పనితీరు సరిగా లేదని, సీఎం అట్టహాసంగా ప్రారంభించిన గచ్చిబౌలి టిమ్స్ ను ఎందుకు మూశారో తెలీదని, మెడికల్ కాలేజీల విషయంలోనూ సర్కారు లెక్కలు తప్పులతడకలా ఉందని ఒవైసీ అన్నారు.

First published:

Tags: AIMIM, Akbaruddin owaisi, CM KCR, Telangana Assembly, Telangana Budget 2022, Telangana jobs, Trs

ఉత్తమ కథలు