హోమ్ /వార్తలు /national /

Telangana: దమ్ముంటే రా.. అక్కడ పోటీ చేద్దాం.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి టీఆర్​ఎస్​ ఎంపీ సవాల్​..

Telangana: దమ్ముంటే రా.. అక్కడ పోటీ చేద్దాం.. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డికి టీఆర్​ఎస్​ ఎంపీ సవాల్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన పోరు సభలో టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ ఎంపీ రేవంత్​కు సవాల్​ విసిరారు.

తెలంగాణ (Telangana)లో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీజేపీ, టీఆర్​ఎస్​ల మధ్య గొడవ జరగ్గా.. అది ఇపుడు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ గొడవలా మారింది. ఇటీవలె టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి (TPCC Chief Revanth reddy)​ సీఎం కేసీఆర్​పై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ నేతలు రేవంత్​పై ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన పోరు సభలో టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్​లో ఆంధ్ర పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ (Telangana)కు ప్రాజెక్టులు సాధించుకున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి (Chevella MP ranjith reddy) సమాధానమిచ్చారు. చేవేళ్ల (Chevella)లో పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే రా.. చేవేళ్లలో పోటీ చేద్దాం అంటూ చేవేళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కోరారు. నువ్వా నేనా చూసుకొందాం అంటూ రంజిత్ రెడ్డి సవాల్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి  సవాల్ విసిరారు.

చేతనైతే పార్లమెంట్లో మాతో కొట్లాడండి..

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ తరఫున చేవేళ్ల (Chevella) నుంచి పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి (TPCC Chief Revanth reddy)కి ఎంపీ రంజిత్ రెడ్డి​ సవాల్ విసిరారు. చేతనైతే ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో మాతో కొట్లాడాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని రేవంత్ రెడ్డిని రంజిత్ రెడ్డి కోరారు .తమ పార్టీ నేతలపై చేస్తున్న విమర్శలకు సంబంధించిన ఆధారాలను చూపాలని  డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు భూములు ఆక్రమించుకొన్నారని కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు.


ఓటుకు నోటు కేటు గాడు...

మీడియా సమావేశంలో టీఆర్​ఎస్ నేత జీవన్​రెడ్డి సైతం రేవంత్​పై విరుచుకుపడ్డారు. జీవన్ రెడ్డి మాట్లాడూతూ..  ‘‘రేవంత్ రెడ్డి పరిగి లో పనికి మాలిన మాటలు మాట్లాడారు. వాటిని తెలంగాణ బిడ్డలెవ్వరూ సమర్ధించరు. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో ఎవ్వరూ గుర్తించడం లేదు.అందుకే త‌న ఉనికిని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. తెలంగాణ (Telangana) నీళ్లు నిధులు నియామకాలు కొల్ల గొట్టిన పార్టీ ల జెండాలు మోసిన రేవంత్ రెడ్డి .. ఇప్పుడూ .. చిలక పలుకులు ప‌లుకుతున్నారు. ఓటుకు నోటు కేటు గాడు.. పెద్ద పోటుగాడిలా పోజు కొట్టి మాట్లాడుతున్నాడు. తుపాకి రాముడి తుప్పు మాటలతో తెలంగాణ‌ కాంగ్రెస్ గానీ, తెలంగాణ కు ఒరిగేదేమీ లేదు.” అన్నారు.

First published:

Tags: Chevella, Mp revanthreddy, TRS leaders

ఉత్తమ కథలు