హోమ్ /వార్తలు /national /

Telangana politics: టీపీసీసీ చీఫ్​ వాళ్ల చెప్పులు మోశారు.. ఆయన తెలంగాణ పప్పు.. రేవంత్​ రెడ్డిపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ధ్వజం

Telangana politics: టీపీసీసీ చీఫ్​ వాళ్ల చెప్పులు మోశారు.. ఆయన తెలంగాణ పప్పు.. రేవంత్​ రెడ్డిపై టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ధ్వజం

తెలంగాణలో టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీజేపీ టీఆర్​ఎస్​ల మధ్య గొడవ జరగ్గా.. అది ఇపుడు కాంగ్రెస్​, టీఆర్​ఎస్​ గొడవలా మారింది. ఇటీవలె రేవంత్​ సీఎం కేసీఆర్​పై ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ నేతలు రేవంత్​పై ధ్వజమెత్తారు.

ఇంకా చదవండి ...

    తెలంగాణ రాజకీయాలు (Telangana politics) వేడిని పుట్టిస్తున్నాయి. తెలంగాణలో వరి సాగు వివాదంపై కేంద్రంలోని బీజేపీతో పోరు మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. క్రమంగా దానిని రాజకీయ పోరాటంగా, జాతీయ స్థాయిలో విపక్షాల ఉమ్మడి వ్యూహంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ స్థితిగతులు తదితర అంశాలపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశా లో సింగరేణి కి చెందిన కోల్ బ్లాక్ లో 50 వేల కోట్ల కుంభ కోణం అంశం తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్​ఎస్​ నేతలు  రేవంత్ రెడ్డి  పై విరుచుకుపడ్డారు.  ప్రభుత్వం విప్‌ బాల్క సుమన్‌ (MLA Balka Suman) తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి జోకర్ లెక్క మాట్లాడుతున్నాడు…ఒక ట్యూటర్ ను పెట్టుకోవచ్చు కదా అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్క‌డ ఉన్నారని ప్ర‌శ్నించారు. ఆయ‌న ఆ స‌మ‌యంలో సమైక్య వాదుల చెప్పులు మోశారని విమ‌ర్శించారు. రేవంత్ నోటి వెంట కుంభ కోణాలు తప్ప మరో పదం రావడం లేదనీ. రేవంత్ రెడ్డే.. వేల కోట్ల అవినీతికి పర్యాయ పదమ‌ని ఎద్దేవా చేశారు.

    జగ్గారెడ్డి గారు రేవంత్​ను పిచ్చాసుపత్రిలో చేర్చించండి..

    ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ (TRSLP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో బాల్క సుమన్ (Balka suman) మాట్లాడారు.  రాహుల్ అఖిల భారత పప్పు అయితే.. రేవంత్ తెలంగాణ కు పప్పు గా తయారయ్యాడని, తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ ను ఎవ్వరూ పట్టించు కోవడం లేదని ఫైర్ అయ్యారు. జైలు లో చిప్ప కూడు తిన్నాక రేవంత్ బ్రేన్లో చిప్ దొబ్బిందనీ, రేవంత్ (revanth) ను తక్షణమే ఎర్ర గడ్డ మెంటల్ ఆస్పత్రి లో చేర్పించాలని జగ్గా రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖర్చులుంటే మేము భరిస్తామ‌ని అన్నారు.కాంగ్రెస్ (Congress) కు రేవంతే ఉరి తాడు గా మారారని విమ‌ర్శించారు.  పరిగి లో రేవంత్​ కల్లు తాగిన కోతి లా వ్యవహరించారనీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు వ్యవసాయం గురించి మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించడమేన‌నీ ఏద్దేవా చేశారు.

    రేవంత్ లో విషం తప్పా …విషయం లేదని, ఈ మధ్య రేవంత్ మాట్లాడిన ఇంగ్లీష్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. ఇంగ్లీష్ కు ట్యూటర్ ను పెట్టుకుంటే మంచిదనీ, ఆయ‌న‌ బట్లర్ ఇంగ్లీష్ ను భరించ లేకపోతున్నారని సూచించారు. ఒడిశా లో సింగరేణి కి చెందిన కోల్ బ్లాక్ లో 50 వేల కోట్ల కుంభ కోణం జరిగిందంటున్నారు. అస్సలు ఆ నైని కోల్ బ్లాక్ లో బొగ్గు విలువ కూడా 50 వేల కోట్లు లేదని రేవంత్ కు తెలుసా? అని ప్ర‌శ్నించారు.

    First published:

    Tags: Balka Suman, Jeevan reddy, Revanth Reddy, Telangana Politics, TRS leaders

    ఉత్తమ కథలు