హోమ్ /వార్తలు /national /

టీఆర్ఎస్ నేతలకు గవర్నర్ పదవులు..సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

టీఆర్ఎస్ నేతలకు గవర్నర్ పదవులు..సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

తెలంగాణ సీఎం కేసీఆర్ (File)

ఖమ్మంలో 58శాతం ఓట్లు నామానాగేశ్వరరావు వస్తాయని ధీమావ్యక్తం చేశారు కేసీఆర్. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

  కేంద్రంలో రాబోయేది లౌకిక కూటమి ప్రభుత్వమేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమావ్యక్తం చేశారు. ప్రాంతీయ పార్టీలకు 260 సీట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు నిరాశ పడవద్దని..తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాబోయే రోజులు మనవేనన్న కేసీఆర్..టీఆర్ఎస్ నేతలకు గవర్నర్ పదవులు రాబోతున్నాయని సంచలన ప్రకటన చేశారు. అందరికీ అవకాశాలుంటాయని తెలిపారు.

  బీజేపీకి 170 సీట్లు మాత్రమే వస్తాయి. కాంగ్రెస్‌కు 100కు మించి రావు. ప్రాంతీయ పార్టీలకు 260 సీట్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ మూడు తరాలుగా పేదరిక నిర్మూలన పాట పాడుతోంది. ఇప్పటికీ పేదరికం పోలేదు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి అధికారంలోకి రావాలి. మనకు మంచి అవకాశముంది. మోదీ నల్లధనం బయటకి తెచ్చి పేదల అకౌంట్లో రూ.15 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చారా? ఛాయ్‌వాలా, చౌకీదార్ నినాదాలే తప్ప ప్రజల కోసం ఏమీ చేయరు. దేశం గతి, గమనం, దిశ మారాలంటే తెలంగాణ నుంచే ప్రభంజనం మొదలవ్వాలి.
  కేసీఆర్, తెలంగాణ సీఎం

  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులకు నా మనవి. ఆయన మా ఇంటి మనిషి. అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంది. టీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నారు. ఇకపై గవర్నర్‌, రాయబారుల పదవులను కూడా అధిష్టించబోతున్నారు. వాటిలో తుమ్మల, పొంగులేటి సేవలను వాడుకోవాలి. రాజకీయంగా చిన్నచిన్న పొరపాట్లు జరిగినా ఇద్దరు కలిసి పనిచేసి నామానాగేశ్వరరావును గెలిపించాలి.
  కేసీఆర్, తెలంగాణ సీఎం
  లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో నిర్వహించిన సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో 58శాతం ఓట్లు నామానాగేశ్వరరావు వస్తాయని ధీమావ్యక్తం చేశారు తెలంగాణ సీఎం. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Khammam, Khammam S29p17, Lok Sabha Election 2019, Nama Nageswara Rao, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics

  ఉత్తమ కథలు