హోమ్ /వార్తలు /national /

పిలిచి పీఠమిస్తే పంగనామాలు పెడుతున్న కోదండరామ్: హరీశ్

పిలిచి పీఠమిస్తే పంగనామాలు పెడుతున్న కోదండరామ్: హరీశ్

హరీశ్‌రావు

హరీశ్‌రావు

టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంపై మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. నాడు తిట్టిన పార్టీలే ఇప్పుడాయనకు మంచివిగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కోదండరాం అసలు స్వరూపం ఇప్పుడు బయటపడిందన్నారు.

  ఉద్యమసమయంలో కేసులు పెట్టి జైల్లో పెట్టించిన వారే ఇప్పుడు కోదండరామ్‌కు దగ్గరయ్యారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆనాడు కోదండరామ్‌ను కాంగ్రెస్, టీడీపీలు టార్గెట్ చేస్తే కంటికి రెప్పలా కాపాడింది గులాబీ జెండాయేనని గుర్తుచేశారు. కానీ, కోదండరామ్ తీరు.. పిలిచి పీఠమిస్తే పంగనామాలు పెట్టినట్టుగా ఉందన్నారు. 2014లో కాంగ్రెస్‌కు పరోక్షంగా సహకరించిన కోదండరాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ పార్టీతో కలిసిపోయారని విమర్శించారు. నాలుగు సీట్ల కోసం ఢిల్లీ, అమరావతిలకు గులాముగా మారిపోయారన్నారు.

  సంగారెడ్డి జిల్లా టీజేఎస్ కార్యదర్శి నగేష్‌ సహా పలువురు కార్యకర్తలు.. మంత్రి హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన హరీశ్.. చెరువుకు బుంగ పడ్డట్టుగా టీజేఎస్ ఖాళీ అవుతోందన్నారు. ఉద్యమకారులకు సీట్లిచ్చి చట్టసభలకు పంపింది టీఆర్ఎస్ పార్టీ అయితే.. జైల్లో పెట్టించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదన్నారు. అలాంటి పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో కోదండరామ్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. వంద సీట్లతో మరోసారి టీఆర్ఎస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Harish Rao, Kodandaram, Mahakutami, Telangana, Telangana Election 2018, Telangana News, TS Congress, TTDP

  ఉత్తమ కథలు