Home /News /national /

POLITICS TRS CM KCR MEETS UTTAR PRADESH OPPN SAMAJWADI PARTY CHIEF AKHILESH YADAV AT DELHI DISSCUSS TO FIGHT BJP PM MODI MKS

CM KCR At Delhi: తుగ్లక్ రోడ్డుకు పెరిగిన రద్దీ.. కేసీఆర్ నివాసానికి అఖిలేశ్ యాదవ్, ఇతర ప్రముఖులు..

అఖిలేశ్ యాదవ్ ను ఆహ్వానిస్తున్న కేసీఆర్

అఖిలేశ్ యాదవ్ ను ఆహ్వానిస్తున్న కేసీఆర్

రాజకీయ ప్రముఖులు, పలు రంగాల నిఫుణుల రాకతో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ఉన్న తుగ్లక్ రోడ్డుకు శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ పెరిగింది. శనివారం నాడు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. వివరాలివే..

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపకల్పనే ధ్యేయంగా దేశవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR Nationwide Tour) ప్రస్తుతం ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయ ప్రముఖులు, పలు రంగాల నిఫుణుల రాకతో సీఎం కేసీఆర్ (Telangana CM KCR) అధికారిక నివాసం ఉన్న తుగ్లక్ రోడ్డుకు శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ పెరిగింది. శనివారం నాడు ఉత్తరప్రదేశ్ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav).. సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. వివరాలివే..

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసంలో జరుగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు దేశంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి నేతలు మాట్లడుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కేసీఆర్ మూలమంత్రమైన బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికి అఖిలేశ్ యాదవ్ సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అఖిలేశ్ కు కేసీఆర్ సత్కారం

CM Jagan | Davos : దావోస్ మార్గంలో దారి మళ్లిన జగన్? -భార్యతో కలిసి సీఎం అక్కడికి వెళ్లారా?


కేసీఆర్-అఖిలేశ్ భేటీలో ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, సమాజ్ వాదీని బలపరుస్తూ స్వయంగా తానే ప్రచారం నిర్వహిస్తానని కేసీఆర్ ప్రకటించినప్పటికీ, ఆయన కొడుకైన మంత్రి కేటీఆర్ సైతం యూపీకి పోతానని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. చివరికి ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ కు సీట్లు పెరిగినా, సీఎం యోగి నేతృత్వంలో బీజేపీ రెండోసారి సర్కారు ఏర్పాటుచేసింది. యూపీ ఎన్నికల తర్వాత బీజేపీపై పోరులో కారు గేరు మార్చిందనే వాదన ఉంది. కాగా, తాజా భేటీలో నేతలు ఏయే అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు? వేటిపై ఇంకా సమాలోచనలు జరుపుతున్నారు? అనేది అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది.

కేసీఆర్ బృందంతో అఖిలేశ్ యాదవ్ ముచ్చట
CM KCR | Centre : ఉద్యోగులకు 50 శాతం జీతాలు! -అప్పులపై కేంద్రం ఆంక్షలతో కటకట -కేసీఆర్ కాంప్రమైజ్?

దేశవ్యాప్తంగా పదిరోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుక్రవారం నాడు ఢిల్లీ వచ్చారు. పర్యటనలో భాగంగానే శనివారం పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశం అవుతున్నారు. ప్రత్యామ్నాయ అజెండాలో దేశానికి సూచించాల్సిన అంశాలపై నిపుణులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు.

CM KCR: పట్టువీడని కేసీఆర్.. నేటి నుంచి దేశవ్యాప్త పర్యటన.. 8 రాష్ట్రాలు ప్రభావితం అయ్యేలా.. ఇదీ ప్లాన్..


ఈనెల 26న బెంగళూరు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అవుతారు. 27న సీఎం కేసీఆర్‌ మహారాష్ట్రలో పర్యటిస్తారు. రాలేగావ్ సిద్ధిలో అన్నహజారేతో భేటీ అవుతారు. మే 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్‌లో సీఎం కేసీఆర్ పర్యటన సాగుతుంది. గల్వాన్ లోయలో అమరులైన సైనిక కుటుంబాలను పరామర్శిస్తారు. సైనిక కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, CM KCR

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు